Budget 2022: బ‌డ్జెట్ పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. ఈ సారి కూడా 'గ్రీన్ బ‌డ్జెట్‌' !

By Mahesh RajamoniFirst Published Jan 27, 2022, 11:51 AM IST
Highlights

Budget 2022: బ‌డ్జెట్ పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ సారి కూడా 'గ్రీన్ బ‌డ్జెట్‌' ను తీసుకోవ‌డానికి సిద్ద‌మైంది. అంటే ఇంత‌కు ముందు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన మాదిరిగానే ఈ సారి కూడా డిజిటల్ బడ్జెట్ నే ప్రవేశపెట్టనుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే బడ్జెట్ ఫిజిక‌ల్ కాపీలను (Budget documents) ముద్రించనున్నారు. బడ్జెట్ పత్రాలు చాలా వరకు డిజిటల్‌గా అందుబాటులో ఉంటాయని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 
 

Budget 2022: బ‌డ్జెట్ పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ సారి కూడా 'గ్రీన్ బ‌డ్జెట్‌' ను తీసుకోవ‌డానికి  సిద్ద‌మైంది. అంటే ఇంత‌కు ముందు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన మాదిరిగానే ఈ సారి కూడా డిజిటల్ బడ్జెట్ నే ప్రవేశపెట్టనుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే బడ్జెట్ ఫిజిక‌ల్ కాపీలను (Budget documents) ముద్రించనున్నారు. బడ్జెట్ పత్రాలు చాలా వరకు డిజిటల్‌గా అందుబాటులో ఉంటాయని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. గతంలో పార్లమెంట్‌ సభ్యులకు, జర్నలిస్టులకు అందించడానికి వందలాది బడ్జెట్‌ ప్రతులను ముద్రించాల్సి వచ్చేది. ఈ ముద్రణ కోసం పార్లమెంట్‌ నార్త్‌ బ్లాక్‌లోని ప్రింటింగ్‌ సిబ్బంది దాదాపు రెండుమూడు వారాల పాటు అక్క‌డే ఉండాల్సి ఉండేది. హల్వా వేడుకతో బ‌డ్జెట్ ప్ర‌తుల ప్రింటింగ్ క్వారంటైన్‌ ప్రారంభమయ్యేది. దీనికి ఆర్థిక మంత్రి, ఉప ఆర్థిక మంత్రులు, సంబంధిత మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు హాజరయ్యేవారు. 

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి NDA ప్రభుత్వం బడ్జెట్ కాపీల ముద్రణను తగ్గించింది. మొదట్లో జర్నలిస్టులకు, బయటి విశ్లేషకులకు పంపిణీ చేయబడిన కాపీలను తగ్గించి, ఆపై మహమ్మారి వ్యాప్తిని పేర్కొంటూ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు అందించే బ‌డ్జెట్ ఫిజిక‌ల్ కాపీల‌ను సైతం త‌గ్గించింది. ప్ర‌స్తుతం దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభ‌ణ కొన‌సాగుతుంది. ఇదే స‌మ‌యంలో పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే బ‌డ్జెట్ డిజిట‌ల్ ప్ర‌తుల‌కు ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఫిజిక‌ల్ కాపీలు అధికంగా ముద్రించ‌క‌పోయినా.. డిజిటల్ బడ్జెట్ పత్రాల సంకలనం కోసం సిబ్బంది కొన్ని రోజుల పాటు నిర్భంధంలో ఉంటారు. అలాగే, సాంప్ర‌దాయంగా వ‌స్తున్న హ‌ల్వా వేడుక‌ను క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటిస్తూ నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. 

కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నాల్గో సారి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్ర‌వేశ‌పెట్టనున్నారు. 2014లో బి‌జే‌పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్ర‌ధాని మోడీ ప్రభుత్వానికి ఇది 10వ బడ్జెట్ కాగా, ఆర్థిక మంత్రిగా సీతారామన్ కి నాలుగో బడ్జెట్. కోవిడ్-19 మహమ్మారి థర్డ్ వేవ్, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య ఈ బడ్జెట్ జనాదరణ పొందుతుందని భావిస్తున్నారు. కాగా, పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో (Parliament Budget session 2022) భాగంగా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లు ఒకే రోజు రెండు వేర్వేరు షిప్టుల్లో ప‌నిచేస్తాయ‌ని పార్ల‌మెంట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రాజ్య‌స‌భ‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లేదా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశమవుతుందని తెలిపాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ సమావేశమవుతుంది. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో పార్ల‌మెంట్ నిర్వ‌హ‌ణ వ‌ర్గాలు ఈ నిర్ణ‌యం తీసుకున్నాయి. 

జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో అనుసరించిన ప్రోటోకాల్‌ల మాదిరిగానే అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. సెప్టెంబరు 2020లో జరిగిన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల  నేప‌థ్యంలో తొలిసారిగా పార్లమెంటరీ కార్యకలాపాలు కఠినమైన కోవిడ్-19 ప్రోటోకాల్ చ‌ర్య‌లు తీసుకున్నారు. రోజు ప్రథమార్థంలో రాజ్యసభ, ద్వితీయార్థంలో లోక్‌సభ సమావేశమయ్యాయి. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. సభ్యులు రెండు ఛాంబర్లలో కూర్చున్నారు. 

click me!