
''భారతదేశంలో ఎఫ్ జైన్, ది పీక్‌ల ప్రారంభం అనేది ప్రభావవంతమైన ప్రేక్షకులకు సమాచారం అందించి, స్ఫూర్తినిచ్చి, వారిని అనుసంధానించే శాశ్వతమైన, ప్రపంచ స్థాయి మీడియా బ్రాండ్‌లను నిర్మించాలన్న మా దార్శనికతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.’ అని ఆశ్రయు మీడియా ఛైర్మన్ సుధాకర్ అడప అన్నారు.
భారతీయ పబ్లిషింగ్ రంగానికి సంబంధించి ఒక చరిత్రాత్మక పరిణామంలో 'ఆశ్రయు మీడియా ప్రైవేట్ లిమిటెడ్' ఒక వినూత్న భాగస్వామ్యాన్ని ప్రకటించింది. సింగపూర్‌లోని అతిపెద్ద మీడియా నెట్‌వర్క్ ‘SPH’ తో కలిసి పనిచేసేందుకు ఆశ్రయు మీడియా సిద్దమయ్యింది. ఆ సంస్థకు చెందిన అత్యంత ప్రసిద్ధ, ప్రతిష్ఠాత్మక పత్రికలైన ‘ఎఫ్ జైన్', 'ది పీక్’ లను భారతదేశంలో ప్రవేశపెట్టనున్నట్లు ఆశ్రయు మీడియా వెల్లడించింది.
ఎఫ్ జైన్ పుట్టి, పెరిగి, ఆ విభాగంలో అగ్రగామిగా స్థిరపడిన తర్వాత సింగపూర్ మార్కెట్ దాటి అంతర్జాతీయంగా విస్తరించడం ఇదే తొలిసారి. మరోవైపు 'ది పీక్' భారతదేశంలోకి ప్రవేశించడం ద్వారా తన అంతర్జాతీయ ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ భాగస్వామ్యం కేవలం భౌగోళిక విస్తరణ మాత్రమే కాదు, ఇదొక సాంస్కృతిక కలయిక. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, ఎంతో చైతన్యవంతమైన భారతీయ మార్కెట్లోకి.. దశాబ్దాల సంపాదకీయ ప్రామాణికత, విశ్వసనీయత, ప్రభావాన్ని ఇది తీసుకువస్తోంది.
పబ్లిషింగ్ రంగంపై ప్రత్యేక దృష్టితో కార్యకలాపాలు సాగిస్తున్న ఆశ్రయు మీడియా ప్రైవేట్ లిమిటెడ్, భారతదేశంలో వేగంగా మారుతున్న మీడియా పర్యావరణ వ్యవస్థలో తనకంటూ ఒక బలమైన గుర్తింపును ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎస్‌పీహెచ్ మీడియాతో కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం ఆ ప్రయాణంలో ఒక కీలక అడుగు.
ఆశ్రయు మీడియాకు ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకమైనది, ఎంతో ఉద్దేశపూర్వకమైనది. భారతదేశంలో లగ్జరీ, లైఫ్‌స్టైల్ కథనాలు చాలా కాలంగా పాశ్చాత్య ప్రమాణాల వైపే మొగ్గుచూపుతున్న ప్రస్తుత తరుణంలో సంస్కృతి, ఫ్యాషన్, డిజైన్, ఆధునిక లగ్జరీ అభిరుచులలో అంతే సుసంపన్నమైన ఆగ్నేయాసియా వైపు దృష్టి మళ్లించేలా ఈ భాగస్వామ్యం ప్రయత్నిస్తోంది. భారతదేశం, ఆగ్నేయాసియా దేశాల మధ్య ఉన్న సహజమైన సాంస్కృతిక, సౌందర్యపరమైన సారూప్యతలను ఈ భాగస్వామ్యం గుర్తిస్తూ, భారతీయ ప్రేక్షకులకు మరింత సందర్భోచితమైన, లోతైన దృక్కోణాన్ని అందిస్తుంది.
ఆశ్రయు మీడియా చైర్మన్ సుధాకర్ అడపా మాట్లాడుతూ... "ఎస్.పి.హెచ్ మీడియా పోర్ట్‌ఫోలియోలో ఎఫ్ జైన్, ది పీక్ అత్యంత విశ్వసనీయమైన పత్రికలుగా బలమైన గుర్తింపును ఏర్పరచుకున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ మీడియా మార్కెట్లకు వీటిని పరిచయం చేయడానికి మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. కేవలం మ్యాగజైన్‌లను ప్రారంభించడం మాత్రమే మా ఆశయం కాదు. ప్రింట్ మీడియా ప్రామాణికతను, డిజిటల్ మీడియా విస్తృతిని, క్యూరేటెడ్ ఎక్స్‌పీరియన్షియల్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావాన్ని ఏకం చేసే వ్యూహంతో అనుసంధానిత మీడియా బ్రాండ్‌లను మేము నిర్మిస్తున్నాము. ఈ విధానం ద్వారా అర్థవంతమైన కమ్యూనిటీలను సృష్టించడం, అన్ని మాధ్యమాల ద్వారా ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందించడం, ప్రేక్షకులతో మరింత సన్నిహితంగా ఉండాలని కోరుకునే ప్రకటనదారులకు, భాగస్వాములకు వినూత్న పరిష్కారాలను అందించడం సాధ్యమవుతుంది. మా గ్రూప్ పరిధిలో బలమైన కన్స్యూమర్ బ్రాండ్‌లను నిర్మించాలనే మా విస్తృత లక్ష్యం దిశగా ఇది ఒక అత్యంత వ్యూహాత్మకమైన అడుగు" అని అన్నారు.
ఇక్కడ వాణిజ్యపరమైన అవకాశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రాంతీయతను, సాంస్కృతిక సామీప్యతను ప్రతిబింబించే పబ్లిషింగ్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే దీనిలోని ప్రధాన ఉద్దేశం. సంప్రదాయ మూలాలతో పాటు భవిష్యత్తు వైపు చూసే ఆగ్నేయాసియా లగ్జరీ విధానం, మారుతున్న భారతదేశ గుర్తింపును ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ భాగస్వామ్యం సమయోచితమైనది, ఎంతో ఆకర్షణీయమైనది.
ప్రస్తుత భారతీయ మీడియా రంగంలో ఒక స్పష్టమైన ఖాళీ కనిపిస్తోంది. 'ఎఫ్ జైన్' లేదా 'ది పీక్' లకు సమానమైన ప్రత్యామ్నాయం నేరుగా ఇక్కడ లేదు. ఈ రెండూ వేర్వేరు వర్గాలకు చెందినవే అయినప్పటికీ సమానమైన ప్రభావవంతమైన ప్రేక్షకులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇంతవరకు ఎక్కువగా దృష్టి సారించని ఈ విభాగాలలో బ్రాండ్‌లను నిర్మించడానికి, రూపుదిద్దడానికి, నాయకత్వం వహించడానికి ఆశ్రయు మీడియాకు ఇది ఒక సువర్ణావకాశాన్ని అందిస్తోంది.
ఎస్‌పీహెచ్ మీడియా లైఫ్‌స్టైల్ డివిజన్, ఓఓహెచ్ బిజినెసెస్ హెడ్ డాషెంగ్ టోహ్ మాట్లాడుతూ.. "ప్రపంచంలోని అత్యంత చైతన్యవంతమైన మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో 'ది పీక్’, ‘ఎఫ్ జైన్' లను పరిచయం చేయడానికి ఆశ్రయు మీడియాతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎస్‌పీహెచ్ మీడియా నుండి వస్తున్న ఈ బ్రాండ్‌లను నిర్వచించే అధునాతనమైన, ఉన్నత-ప్రమాణాలతో కూడిన లైఫ్‌స్టైల్ కంటెంట్ పట్ల భారతదేశంలో స్పష్టమైన ఆసక్తి ఉంది. భారతదేశంలోని ఆధునిక, విజ్ఞులైన ప్రేక్షకులను ఆకట్టుకునే క్రమంలో సుధాకర్, ఆయన బృందంలో మాకు ఒకే ఆలోచనా విధానం ఉన్న భాగస్వామి దొరికారు" అని పేర్కొన్నారు.
ఐదు దశాబ్దాలకు పైగా యువత సంస్కృతిలో 'ఎఫ్ జైన్' ఒక నిర్ణయాత్మక గొంతుకగా నిలిచింది. నేడు ఫ్యాషన్, అందం, పాప్ సంస్కృతి, జీవనశైలి, సృజనాత్మక పరిశ్రమలలో భవిష్యత్ ఆలోచనలను నమోదు చేస్తూ ఇది ఒక సాంస్కృతిక మార్గదర్శిగా నిలుస్తోంది. కేవలం ఒక మ్యాగజైన్‌గా మాత్రమే కాకుండా భవిష్యత్ తరం ఎలా జీవిస్తోంది, తమను తాము ఎలా వ్యక్తపరుచుకుంటోంది, సంస్కృతిని ఎలా నిర్వచిస్తోందనే దృక్కోణాలను ఎఫ్ జిన్ సంగ్రహిస్తుంది. ఇప్పుడు ఆశ్రయు మీడియా ఆధ్వర్యంలో భారతదేశం దీని మొట్టమొదటి అంతర్జాతీయ ఫ్రాంచైజీ మార్కెట్‌గా మారుతోంది.
దీనికి జోడీగా 'ది పీక్' వస్తోంది. ఇది 1984 నుండి నాయకులు, వ్యాపారవేత్తలు, దార్శనికుల ప్రయాణాలను వివరిస్తున్న ఒక వ్యాపార-జీవనశైలి పబ్లికేషన్. ఆలోచింపజేసేలా అర్థవంతమైన కథనాలకు ప్రసిద్ధి చెందిన 'ది పీక్', కేవలం విజయగాథలకే పరిమితం కాకుండా పనిలోని ఉద్దేశం, నాయకత్వం, ప్రభావాన్ని విశ్లేషిస్తుంది. ఆధునిక ఆశయాలు, ప్రభావాలపై విలక్షణమైన దృక్పథాన్ని అందిస్తూ సీ-సూట్ ఎగ్జిక్యూటివ్‌లు, నిపుణుల నమ్మకమైన గొంతుకగా ఇది నిలుస్తోంది. 40కి పైగా వార్తలు, లైఫ్‌స్టైల్, వినోద బ్రాండ్‌లకు నిలయమైన ఎస్‌పీహెచ్ మీడియా, ఆసియా అంతటా తన సంపాదకీయ నైపుణ్యం, ప్రభావానికి దీర్ఘకాల గుర్తింపు పొందింది. సమాచారం అందించడం, అనుసంధానించడం, స్ఫూర్తినివ్వడం అనే లక్ష్యంతో ప్రింట్, డిజిటల్, రేడియో, అవుట్‌డోర్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇది తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
"నాయకత్వం, వ్యవస్థాపకత, అత్యుత్తమ ప్రతిభను ప్రశంసించే తన సుదీర్ఘ వారసత్వాన్ని 'ది పీక్' భారతదేశ వ్యాపార వర్గాలకు తీసుకువస్తుంది. అదే సమయంలో లైఫ్‌స్టైల్, సృజనాత్మకత, ఆవిష్కరణల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న, సాంస్కృతికంగా అనుసంధానించబడిన సరికొత్త డిజిటల్ తరంతో 'ఎఫ్ జైన్' మాట్లాడుతుంది" అని అడపా అన్నారు.
ఈ భాగస్వామ్యంతో ఆశ్రయు మీడియా, ఎస్‌పీహెచ్ మీడియా సంస్థలు.. ప్రపంచస్థాయి అవగాహనతో, ప్రాంతీయ మూలాలతో, సాంస్కృతిక సందర్భోచితమైన ఒక సరికొత్త సంపాదకీయ ప్రమాణానికి భారతదేశంలో పునాది వేస్తున్నాయి.