OPPO K14 5G: ఇంత తక్కువ బ‌డ్జెట్‌లో ఇలాంటి ఫీచ‌ర్లు ఏంటి భ‌య్యా.? ఒప్పో నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్

Published : May 01, 2026, 03:29 PM IST
 OPPO K14 5G

సారాంశం

OPPO K14 5G: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ ఒప్పో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో కే14 పేరుతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో అదిరిపోయే ఫీచ‌ర్ల‌ను అందించారు. ఇంత‌కీ ఫోన్‌లో ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయో తెలుసుకుందాం.  

రోజంతా మన చేతిలో ఉండే ముఖ్యమైన వస్తువు స్మార్ట్‌ఫోన్‌. చెల్లింపులు చేయడం, మ్యాప్స్ చూడడం, కాల్స్, మెసేజెస్, గేమింగ్. అన్నీ ఫోన్‌పైనే ఆధారపడతాయి. ఈ సమయంలో ఫోన్ స్లో అయితే, ల్యాగ్ వస్తే లేదా బ్యాటరీ త్వరగా తగ్గిపోతే మన పని మొత్తం గందరగోళంగా మారుతుంది. చాలా ఫోన్లు మొదట్లో బాగా పని చేస్తాయి. కానీ కొద్ది నెలల తర్వాత యాప్స్ పెరిగినకొద్దీ, డేటా పెరిగినకొద్దీ స్మూత్‌నెస్ తగ్గిపోతుంది. ఇదే సమస్యకు పరిష్కారంగా OPPO K14 5Gని రూపొందించారు.

రోజూ ఉపయోగంలో స్మూత్ అనుభవం

ఫోన్ స్మూత్‌గా పని చేస్తే మనం గమనించం. కానీ ల్యాగ్ వస్తే వెంటనే తెలుస్తుంది. ఒప్పో కే14 5జీ స్మార్ట్‌ఫోన్‌లో

60 నెలల ఫ్యూయ‌న్సీ ప్రొటెక్ష‌న్ ఉంది. అంటే దీర్ఘకాలం పాటు కూడా ఫోన్ స్మూత్‌గా పని చేస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఇచ్చారు. అలాగే క‌ల‌ర్ ఓఎస్ 15 ట్రినిటీ ఇంజ‌న్ అండ్ డ్యూయ‌ల్ ఇంజ్ ఆప్టిమైజేష‌న్ వంటివ‌న్నీ క‌లిసి యాప్స్ మళ్లీ మళ్లీ రీలోడ్ కాకుండా చేస్తాయి. మల్టీటాస్కింగ్ సులభంగా ఉంటుంది. గేమింగ్ సమయంలో ల్యాగ్ తగ్గుతుంది.

ఈ ఫోన్‌లో అద‌నంగా 16GB వరకు RAM ఎక్స్‌పాన్ష‌న్‌, 3900mm² సూప‌ర్‌కూల్ వేప‌ర్ ఛాంబ‌ర్ వంటివి ఎక్కువసేపు వాడినా ఫోన్ హీట్ కాకుండా కంట్రోల్ చేస్తాయి.

భారీ బ్యాటరీ – రోజు మొత్తం టెన్షన్ ఫ్రీ

బ్యాటరీ సమస్య చాలా మందికి పెద్ద టెన్షన్. కానీ ఈ ఫోన్‌తో అది తగ్గుతుంది. 7000mAh బ్యాటరీ – ఈ సెగ్మెంట్‌లో చాలా పెద్దది. ఒకరోజు పూర్తి ఉపయోగం (కాల్స్, వీడియోలు, సోషల్ మీడియా, గేమింగ్) సులభంగా సాగుతుంది. ఇందులో 45W సూప‌ర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ అందించారు. దీంతో ఈ ఫోన్‌ తక్కువ టైంలో చార్జ్ అవుతుంది.

ఇంకా ముఖ్యంగా బ్యాటరీ దీర్ఘకాలం హెల్త్ కాపాడుతుంది. ఒకటి రెండు సంవత్సరాల తర్వాత కూడా పనితీరు తగ్గదు. రోజువారీ ఉపయోగానికి బలమైన డిజైన్. ఫోన్‌ను ఎప్పుడూ జాగ్రత్తగా వాడటం సాధ్యం కాదు. అందుకే ఈ ఫోన్ దానికి సరిపోయేలా డిజైన్ చేశారు. ఇక నీరు, దూళి నుంచి ర‌క్ష‌ణ కోసం ఇందులో IP66, IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు. MIL-STD-810H సర్టిఫికేషన్ వంటి మిలిటరీ స్థాయి టెస్టింగ్ కూడా ఈ ఫోన్ సొంతం. అంటే వర్షంలో వాడినా సమస్య ఉండ‌దు. కాస్త పడినా టెన్షన్ అవసరం లేదు. ఇంకా అద‌న‌పు ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఇందులో 6.75 ఇంచెస్‌తో కూడి డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1125 nits బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. దీంతో ఎండలో కూడా స్క్రీన్‌ క్లియర్‌గా కనిపిస్తుంది. అదనంగా స్ప్లాష్ ట‌చ్‌, గ్లోవ్ ట‌చ్ వంటివి ఇచ్చారు.

ఈ ఫోన్ ప్రత్యేకత స్పీడ్ కాదు, స్థిరత్వం.

ఎక్కువసేపు గేమింగ్ చేసినా ఒకేసారి ఎన్నో యాప్స్ వాడినా, బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లు నడిచినా, పనితీరు తగ్గకుండా ఉంటుంది. కూలింగ్ సిస్టమ్ హీట్‌ను కంట్రోల్ చేస్తుంది.

కెమెరా విష‌యానికొస్తే..

ఇక కెమెరా విష‌యానికొస్తే ఇందులో 50MP AI కెమెరాను అందించారు. దీంతో సులభంగా మంచి ఫోటోలు తీసుకోవ‌చ్చు. కెమెరా అవసరం లేని ఆబ్జెక్ట్స్ తొలగిస్తాయి. బ్లర్ తగ్గిస్తాయి, లో లైట్ ఫోటోలు మెరుగుపరుస్తాయి, రిఫ్లెక్షన్ తగ్గిస్తాయి. అంటే, ఫోటో తీసిన తర్వాత ఎడిటింగ్ అవసరం తక్కువగా ఉంటుంది.

కొనుగోలు తర్వాత సపోర్ట్ కూడా

OPPO ఈ ఫోన్‌కు మంచి సర్వీస్ అందిస్తోంది. 30 రోజుల రీప్లేస్‌మెంట్ ఆఫర్, OPPO Care సర్వీస్ ప్లాన్స్, దేశవ్యాప్తంగా 580+ సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి.

ధ‌రలు ఎలా ఉన్నాయంటే.?

* 6GB + 128GB వేరియంట్ ధ‌ర రూ. 19,999

* 8GB + 256GB వేరియంట్ ధ‌ర రూ. 23,999గా నిర్ణ‌యించారు.

* ఇక ఆఫ‌ర్ల విష‌యానికొస్తే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డుల‌తో రూ. 1000 డిస్కౌంట్ పొందొచ్చు. 3 నెలల నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్ష‌న్ కూడా ఉంది.

ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. చాలా ఫోన్లు మొదట బాగా పని చేస్తాయి. కానీ కాలక్రమంలో పనితీరు తగ్గిపోతుంది. కానీ OPPO K14 5G మాత్రం దీర్ఘకాలం స్మూత్‌గా పని చేయడంపై దృష్టి పెట్టింది. భారీ బ్యాటరీ, బలమైన నిర్మాణం, స్థిరమైన పనితీరు అన్నీ క‌లిపి మంచి అనుభవాన్ని ఇస్తుంది. రూ. 25,000 లోపు ల్యాగ్ లేకుండా పని చేసే ఫోన్, తరచూ చార్జ్ చేయాల్సిన అవసరం లేని బ్యాటరీ, బలమైన బిల్డ్ వంటివి కావాలంటే ఈ ఫోన్ మంచి ఎంపికగా చెప్పొచ్చు.

PREV
Brand Promotion Articles (బ్రాండ్ ప్రమోషన్ కథనాలు): Explore brand stories featuring partner content, brand collaborations, and sponsored insights. Read engaging branded narratives, campaigns, and initiatives on Asianet News Telugu.
Read more Articles on
click me!

Recommended Stories

Orient exchange: హైద‌రాబాదీల‌కు గుడ్ న్యూస్‌.. ఇక‌పై విదేశీ కరెన్సీ, ఫారెక్స్ కార్డులు, మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ మ‌రింత సులువు
OPPO F33 Pro Review : అద్భుతమైన సెల్ఫీ, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ.. ఈ స్మార్ట్ ఫోన్ తో మీ రోజు మరింత స్పెషల్