Emirates Draw : 26 ఏళ్ళ కుర్రాడిని వరించిన అదృష్టం.. ఎమిరేట్స్ డ్రాలో ఏకంగా $4 మిలియన్లు గెలుచుకున్నాడు

Published : Oct 08, 2026, 10:33 AM IST
Emirates Draw

సారాంశం

26 ఏళ్లు ఓ యువ అకౌంటెంట్ కు ఊహించని విధంగా అదృష్టం వరించింది. ఎమిరేట్స్ డ్రాలో అతడు విజేతగా నిలిచాడు… అతడిపై కాసుల వర్షం కురిసింది. ఇంతకూ ఎంత ప్రైజ్ మనీ గెలుచుకున్నాడో తెలుసా?

Emirates Draw చరిత్రలో తొలిసారిగా ఒకే డ్రాలో అన్ని ప్రైజ్ టయర్లలోనూ డబ్బులు గెలుచుకున్న వ్యక్తిగా కేరళకు చెందిన 26 ఏళ్ల మెల్విన్ ఫ్రాన్సిస్ నిలిచాడు. అతడు కొనుగోలు చేసిన 11 EASY6 టికెట్లలో ఐదు టికెట్లు డ్రాలో వచ్చాయి... దీంతో 4 మిలియన్ డాలర్ల గ్రాండ్ ప్రైజ్‌తో సహా, బహుమతులు గెలుచుకున్నాడు. ఇప్పటివరకు గ్రాండ్ ప్రైజ్ గెలిచిన తొమ్మిది మందిలో మెల్విన్ అత్యంత చిన్న వయస్కుడు.

ఎమిరేట్ డ్రాలో 4 మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్లు తెలిపే ఫోన్ కాల్ మెల్విన్ ఆఫీసులో ఉండగా లంచ్ బ్రేక్‌ సమయంలో వచ్చిందట. ఆయన పక్కనే ఒక సహోద్యోగి కూర్చుని ఉంది... ఫోన్‌లో ఎవరు మాట్లాడుతున్నారని ఆసక్తిగా గమనించిందట. అయితే అది ముఖ్యమైన కాల్ అని మాత్రమే చెప్పి మెల్విన్ అక్కడితో ఆపేశారు. “నేను గట్టిగా అరిస్తే ఏదో పెద్ద విషయం జరిగిందని అందరికీ అర్థమైపోతుంది. అందుకే నా భావోద్వేగాలను అదుపులో ఉంచుకున్నాను” అని మెల్విన్ చెప్పారు.

ఎమిరేట్స్ డ్రా చరిత్రలో ఇంతకుముందెన్నడూ జరగని అరుదైన ఘటన ఇది. 2026 ఆగస్టు 21న మెల్విన్ 11 EASY6 టికెట్లు కొనుగోలు చేశారు. వాటిలో ఐదు టికెట్లు విజేయాన్ని కట్టబెట్టాయి. ఈ ఐదు టికెట్లు EASY6 గేమ్‌లోని ప్రతి ప్రైజ్ టయర్‌ను కవర్ చేశాయి. ''ఎమిరేట్స్ డ్రా చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు, గ్రాండ్ ప్రైజ్‌తో సహా అన్ని ప్రైజ్ టయర్లలో ఐదు EASY6 టికెట్లతో నేను ప్రైజ్ మనీ గెలిచాను!” అని మెల్విన్ అన్నారు.

మెల్విన్ ఆశలకు రెక్కలొచ్చాయి

స్వదేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా ఎంతో మంది యువ భారతీయులు విలువలతో పెరుగుతారు. తల్లిదండ్రులను గౌరవించాలి... పెద్దల మాట వినాలి... చదువును పూర్తి చేయాలి... కుటుంబం, సమాజం అంగీకరించే హద్దుల్లో ఉండాలి.. చాలా మంది ఈ విలువలను పాటిస్తారు. అయితే తాము జీవిస్తున్న జీవితానికి మించిన ఎన్నో ఆశలను కూడా తమ మనసులో దాచుకుంటారు. మెల్విన్ ప్రయాణం కూడా దాదాపు ఇలాగే సాగింది. కేరళలో జన్మించిన ఆయన బెంగళూరులో చదువుకున్నారు. సైన్స్‌పై తనకు పెద్దగా ఆసక్తి లేకపోవడంతో అకౌంటింగ్‌ను ఎంచుకున్నారు. చదువుకుంటూనే ఉద్యోగం చేయడంతో ఆయన డిగ్రీ పూర్తి చేయడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టింది.

తనకు వచ్చిన తొలి జీతం మొత్తాన్ని కుటుంబ బాధ్యతలు మోస్తున్న తన తండ్రికి ఇచ్చేశారు. తన అవసరాలకు సరిపడే కనీస మొత్తాన్ని మాత్రమే తిరిగి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన US CMA పూర్తి చేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ఎంబిఏ చేస్తున్నారు. అదే సమయంలో US CPA కోసం కూడా సిద్ధమవుతున్నారు. ఇవన్నీ చేస్తూనే తండ్రితో కలిసి కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తూ పూర్తి సమయం ఉద్యోగం చేస్తున్నారు.

ఆయన తల్లి ఇచ్చిన సలహా కూడా మెల్విన్ సుదీర్ఘమైన పని ప్రయాణంలో కీలకంగా నిలిచింది. “30 ఏళ్ల వరకు కష్టపడి పనిచేసి, ఆ తర్వాతి జీవితానికి డబ్బు పొదుపు చేసుకోవాలని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. ఇప్పుడు నా వయసు 26 సంవత్సరాలు. బహుమతి డబ్బు రావడంతో 30 ఏళ్ల వరకు వేచి ఉండాల్సిన అవసరం నాకు లేదు” అని మెల్విన్ చెప్పారు.

ఎమిరేట్స్ డ్రా వైపు తొలి అడుగు...

మెల్విన్ ఎమిరేట్స్ డ్రా గురించి తొలిసారి సోషల్ మీడియా ప్టాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసుకున్నారు. $27 మిలియన్ల MEGA7 విజేత శ్రీరామ్ ఆర్, తొలి $4 మిలియన్ల EASY6 విజేత అజయ్ ఓ. ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా ఆయనకు ఈ Emirates Draw గురించి తెలిసింది.

తన పుట్టినరోజు జరిగిన వారం తర్వాత, 2026 జూన్ 14న తొలిసారి MEGA7 టికెట్ కొనుగోలు చేశారు మెల్విన్. నాలుగు నంబర్లు సరిపోవడంతో ఆయనకు $14 లభించింది. దీంతో ఆయనకు మరింత ఆసక్తి కలిగింది. ఆ తర్వాత వచ్చిన విజేతల ఇంటర్వ్యూలు ఆయనను మరింత ఆకర్షించాయి. “మిగతా గ్రాండ్ ప్రైజ్ విజేతల ఇంటర్వ్యూలన్నింటినీ చూశాను” అని మెల్విన్ చెప్పారు.

అయితే తనకు నేరుగా సంబంధం ఉన్నట్లు అనిపించినది అజయ్ ఇంటర్వ్యూనే అని మెల్విన్ చెప్పారు. ఆయన వారానికోసారి జరిగే డ్రాలను విశ్లేషించారు. టికెట్ ధర, తనకు నచ్చిన గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని EASY6ను ఎంచుకున్నారు. నంబర్లను స్వయంగా ఎంచుకోవడానికి బదులుగా ర్యాండమైజర్ ఆప్షన్‌ను ఉపయోగించారు. “ప్రతి టికెట్‌లో నంబర్ల సెట్ నచ్చే వరకు ర్యాండమైజర్ ఐకాన్‌ను మళ్లీ మళ్లీ నొక్కేవాడిని” అని ఆయన చెప్పారు. అలా రెండు నెలల పాటు వారాంతాల్లో EASY6 ఆడుతూ వచ్చారు.

ఆ రోజు ఏం జరిగింది?

చివరకు ఆ రోజు రానే వచ్చింది. ఐదు నంబర్లు సరిపోవడంతో వచ్చిన $8,333 షేర్డ్ ప్రైజ్ మొదట ఆయన ఖాతాలో కనిపించింది. అందుకే ఆగస్టు 26న Emirates Draw నుంచి ఫోన్ వచ్చినప్పుడు అది ఏదైనా మోసపూరిత కాల్ అయి ఉంటుందని ఆయన అనుకోలేదు. అయితే పెద్ద మొత్తంలో గెలిచిన విజేతలకు నిర్వహించే భద్రతా, గుర్తింపు ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు $4 మిలియన్ల మొత్తం ఆయన ఖాతాలో కనిపించలేదు. అందుకే మొదట చిన్న మొత్తమే కనిపించింది. “వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు అంతా అర్థమవుతోంది. విజేతల భద్రత కోసమే ఈ ప్రక్రియ ఉంటుందని తెలుసుకున్న తర్వాత దాన్ని నేను మరింతగా అభినందిస్తున్నాను” అని మెల్విన్ చెప్పారు.

ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఈ వార్తను కుటుంబంలో పూర్తిగా నిర్ధారించుకున్నారు. మొదట తన తండ్రికి, సోదరికి చెప్పారు. ఆయన తండ్రి ప్రతి టికెట్‌ను స్వయంగా పరిశీలించాలనుకున్నారు. ఆయన సోదరి ఇచ్చిన సలహా మాత్రం చాలా సింపుల్‌గా ఉంది. “మీ టికెట్లను మరోసారి చెక్ చేయండి. నంబర్లు ఒకేలా ఉన్నాయో చూసుకోండి. వచ్చిన వార్త నిజమేనని నిర్ధారించుకోండి.” టికెట్లను పరిశీలించిన తర్వాతే కుటుంబ సభ్యులకు అసలు విషయం పూర్తిగా అర్థమైంది.

బహుమతి డబ్బుతో ఏం చేయబోతున్నారు?

ఇంత పెద్ద మొత్తం చేతికి వచ్చిన తర్వాత ఇక ముందు ఏం చేయాలన్న ప్రశ్నకు మెల్విన్ ఇచ్చిన మొదటి సమాధానంలో తన గురించి పెద్దగా ఏమీ లేదు. తన తండ్రి కుటుంబ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సహాయం చేయాలనుకుంటున్నారు. తద్వారా తన తండ్రి త్వరగా రిటైర్ అయ్యేలా చూడాలని ఆయన భావిస్తున్నారు. ఈ బహుమతిని కేవలం తనకు వచ్చిన రివార్డుగా కాకుండా ఒక బాధ్యతగా చూస్తున్నారు. “ఇప్పుడు ఈ బహుమతితో నాకు ఒక కొత్త రకమైన యాజమాన్య భావన వచ్చింది. సరైన అవకాశాల్లోనే పెట్టుబడులు పెడుతున్నానని నిర్ధారించుకోవాలని కుంటున్నాను” అని మెల్విన్ చెప్పారు.

అయితే, ఆయన తీసుకున్న రెండో నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరచవచ్చు. ఇంత భారీ బహుమతి వచ్చిన తర్వాత చాలామంది పుస్తకాలు, చదువులకు దూరంగా ఉండాలని అనుకోవచ్చు. కానీ మెల్విన్ మాత్రం అందుకు విరుద్ధంగా చేస్తున్నారు. ఆయన ఇప్పటికీ MBA పూర్తి చేస్తున్నారు. ఉద్యోగానికి వెళ్తున్నారు. అంతేకాదు, US CPA సాధించాలన్న తన లక్ష్యాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ చదువుకు అయ్యే ఖర్చును తానే భరించగలరు. “నేను US CPA అర్హతను సాధించాలనుకుంటున్నాను. ఇకపై మా నాన్నను ఆర్థిక సహాయం అడగాల్సిన అవసరం లేకుండా ఆ చదువుకు అయ్యే ఖర్చును నేనే భరించగలను” అని ఆయన చెప్పారు.

కుటుంబం.. ప్రయాణాలు.. మరిన్ని కలలు

తనకంటూ ఉన్న వ్యక్తిగత కలలు ఆ తర్వాత వస్తాయని మెల్విన్ చెబుతున్నారు. అమెరికాలో తన కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని కలవాలని, ఆ తర్వాత ప్రపంచాన్ని చుట్టి రావాలని ఆయన కోరుకుంటున్నారు. “ప్రపంచమంతా ప్రయాణించాలి. ఏదైనా ఖర్చు చేసేటప్పుడు రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఉండాలి” అని ఆయన తన కోరికను వెల్లడించారు.

తన సోదరుడు, సోదరి వివాహాలకు కూడా సహాయం చేయాలని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు భవిష్యత్తులో $30 మిలియన్ల MEGA7 గ్రాండ్ ప్రైజ్‌ను కూడా గెలుచుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. “నేను ఇప్పటికే టికెట్లు కొనేశాను!” అని మెల్విన్ సరదాగా చెప్పారు.

ఇక మెల్విన్ భవిష్యత్తు రోజులు ఎలా ఉండబోతున్నాయి? దీనిపై ఆయన సమాధానం కూడా చాలా సింపుల్‌గా ఉంది. “నిజాయితీగా చెప్పాలంటే, నేను మౌనంగానే ఉండిపోతాను. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు అందరికీ విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఫోన్ కాల్స్ రావడం మొదలవుతుంది!” అని ఆయన అన్నారు.

4 మిలియన్ డాలర్ల విజయం వచ్చినా మెల్విన్ రోజువారీ జీవితం పెద్దగా మారలేదు. ఆయన అలారం ఇప్పటికీ ప్రతిరోజూ ఉదయం 6:30 గంటలకు మోగుతుంది. అల్పాహారం తీసుకుని ఆఫీసుకు వెళ్తారు. మధ్యాహ్న భోజన విరామాన్ని తన తండ్రితో కలిసి గడుపుతారు.తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా తండ్రిని పేర్కొంటూ మెల్విన్ ఇలా అన్నారు.. “నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అందుకు కారణం మా నాన్నే.”

PREV
Brand Promotion Articles (బ్రాండ్ ప్రమోషన్ కథనాలు): Explore brand stories featuring partner content, brand collaborations, and sponsored insights. Read engaging branded narratives, campaigns, and initiatives on Asianet News Telugu.
Read more Articles on
click me!

Recommended Stories

kargil vijay diwas: టైగర్ హిల్ నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు.. కార్గిల్ నిర్మించింది ఏంటి.?
Mosquito Agarbatti: డెంగ్యూ కంటే ఈ దోమ‌ల అగ‌ర్బ‌త్తీలే ప్ర‌మాదం.. 70 శాతం మంది వైద్యులు చెప్తోన్న నిజం