టీవీఎస్ మోటార్స్‌ చేతికి బ్రిటిష్ బైక్ కంపెనీ...

By Sandra Ashok KumarFirst Published Apr 21, 2020, 3:32 PM IST
Highlights

టీవీఎస్‌ మోటార్స్‌ లిమిటెడ్,  ఐకానిక్ బ్రిటిష్ బైక్ తయారీదారు నార్టన్ మోటార్ సైకిల్స్ (యుకె) లిమిటెడ్‌ను సొంతం చేసుకుంది. ఈ డీల్‌ మొత్తం విలువ రూ.153.12 కోట్లు అని టీవీఎస్‌ మోటార్స్‌  రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న ద్విచక్ర వాహనాల ఉత్పత్తి సంస్థలో ఒకటైన టూవీలర్‌ తయారీదారు టీవీఎస్‌ మోటార్స్‌ లిమిటెడ్,  ఐకానిక్ బ్రిటిష్ బైక్ తయారీదారు నార్టన్ మోటార్ సైకిల్స్ (యుకె) లిమిటెడ్‌ను సొంతం చేసుకుంది.

ఈ డీల్‌ మొత్తం విలువ రూ.153.12 కోట్లు అని టీవీఎస్‌ మోటార్స్‌  రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీకి చెందిన  సింగపూర్  అనుబంధ సంస్థ ఈ మేరకు నార్టన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

నార్టన్‌కు చెందిన అన్ని ఆస్తులు, నార్టన్‌, దానికి సంబంధించిన అన్ని బ్రాండ్‌లను సోంతం చేసుకున్నామని వెల్లడించింది. ఈ డీల్ తమ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచడానికి, కస్టమర్ల ఆకాంక్షలను తీర్చడానికి అపారమైన అవకాశాన్నిస్తుందని  టీవీఎస్ మోటార్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు తెలిపారు.

also read వాటితో మెడికల్ గౌన్లు, ఫేస్ మాస్కులను తయారి చేయనున్న ఫోర్డ్ కంపెనీ

అంకితమైన వ్యాపార ప్రణాళికలతో నార్టన్ తన విలక్షణమైన గుర్తింపును నిలుపుకుంటుందని,  బ్రిటిష్ కంపెనీ కస్టమర్లు,  ఉద్యోగులతో టీవీఎస్ మోటార్ కలిసి పనిచేస్తుందన్నారు.

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన జేమ్స్‌ లాన్స్‌డౌన్‌ నార్టన్‌ 122 సంవత్సరాల  క్రితం(1898లో)నార్టన్‌ మోటార్‌సైకిల్స్‌ను ప్రారంభించారు.  వీ4 ఆర్‌ఆర్‌, డామినేటర్‌, కమాండో 961 కేఫ్‌ రేసర్‌ ఎంకే-2, కమాండో 961 స్పోర్ట్‌ ఎంకే-2లు నార్టన్‌  మోడల్స్ బైక్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి.

తాజాగా టి‌వి‌ఎస్ బి‌ఎస్ 6 ఉధ్గర నిబంధనలకు అనుగుణంగా ఇంజన్లను అప్ డేట్ చేసి వాహనాలను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

click me!