టీవీఎస్ మోటారు సైకిల్స్ సంస్థ విపణిలోకి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 2004వీ మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. బ్లూటూత్ కనెక్షన్‌తో పని చేసే ఈ బైక్ ధర రూ.1.14 లక్షలు మాత్రమే.
ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘టీవీఎస్’ విపణిలోకి సరికొత్త అపాచీ బైక్‌ను ఆవిష్కరించింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ పేరిట తీసుకు వచ్చింది. ఇది టీవీఎస్ మొబైల్ యాప్ ‘స్మార్ట్ కనెక్ట్’తో బ్లూత్ ఆధారంగా పని చేస్తుంది.
గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్‌లో ఈ మొబైల్ యాప్ లభిస్తుందని టీవీఎస్ పేర్కొంది. బ్లూటూత్ కనెక్టెవిటీతో పని చేసే ఈ యాప్‌లో అధునాతన ఫీచర్లను జోడించింది టీవీఎస్. నేవిగేసన్, రేస్ టెలీమెట్రీ, టూర్ మోడ్, లీన్ యాంగిల్ మోడ్, క్రాష్ అలర్ట్, కాల్ లేదా ఎస్సెమ్మెస్ నోటిఫికేషన్ వంటి వసతులు ఇందులో ఉన్నాయని టీవీఎస్ వివరించింది.
undefined
యాంగిల్ మోడ్‌లో అది ఫోన్ గైరోస్కోప్ సెన్సార్‌ను ఉపయోగించుకుని బైక్ ఎంత వాలుగా ప్రయాణించిందో బైక్ డిస్ ప్లేలో ప్రదర్శిస్తుంది. మీరు ఎంత దూరం ప్రయాణించారో సంబంధిత వివరాలను టెలీమెట్రీ వంటి ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఒక మోటారు సైకిల్ ఎక్కడైనా కింద పడితే వెంటనే మీ ఫోన్ లోని ఎమర్జెన్సీ నంబర్ కు సందేశం వెళుతుంది. మూడు నిమిషాల్లో అది అవతలి వ్యక్తి చేరుతుందని టీవీఎస్ వెల్లడించింది.
ఇక ఈ బైక్‌లో 197.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. 5 స్పీడ్ గేర్ బ్యాక్ అందుబాటులో ఉన్నఈ బైక్ ధర రూ.1,14,345గా నిర్ణయించింది టీవీఎస్, బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో ఈ నెలలో వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది.