విపణిలోకి ప్రీమియర్ బైనెల్లీ లియాన్సియో 250: వచ్చే ఏడాది మరో 5 బైక్‌లు

By telugu team  |  First Published Oct 5, 2019, 12:17 PM IST


ప్రముఖ ప్రీమియం మోటారు సైకిళ్ల తయారీ సంస్థ బైనెల్లి తాజాగా భారత విపణిలోకి లియాన్సియో 250 బైక్ ఆవిష్కరించింది. దీని ధర రూ.2.50 లక్షలుగా నిర్ణయించింది బైనెల్లి.


ప్రీమియం మోటారు సైకిళ్ల తయారీ సంస్థ బెనెల్లీ వచ్చే ఏడాది భారత మార్కెట్‌లోకి మరో అయిదు మోటారు సైకిళ్లను విపణిలో ప్రవేశపెట్టనుంది. భారత్‌ మార్కెట్‌లోకి కొత్తగా ప్రవేశించడం వల్ల బెనెల్లీ బైకుల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయని బెనెల్లీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ ఝబాక్‌ తెలిపారు. 

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ ఆరు మోడల్ మోటారు సైకిళ్లను ఆవిష్కరించింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏడో బైక్ ‘లియోన్‌సినో 250’ను విడుదల చేసింది. దీని ధర రూ.2.5 లక్షలు. త్వరలో దీపావళి నాటికి క్రూజర్ విభాగంలో క్రూయిజ్‌ బైక్‌ ఇంపీరియల్ 400 బైక్‌ను విడుదల చేయనున్నామని వికాస్‌ చెప్పారు.
 
ఇప్పటివరకు విడుదల చేసిన ఆరు మోడల్ మోటారు సైకిళ్లు 300-600 సీసీ మధ్య ఉండగా, తాజాగా విడుదల చేసిన లియోన్ సినో 250 మోడల్ బైక్ 250 సీసీ సామర్థ్యంతో కూడుకున్నది. మూడేళ్ల అపరిమిత కిలోమీటర్ల వ్యారంటీతో ‘లియోన్‌సినో 250’ బైక్ తెలుపు, గ్రే, ఎరుపు, గోధుమ రంగుల్లో లభ్యమవుతుంది.

Latest Videos

ఈ తరం యువతను ఆకట్టుకునే విధంగా ఈ మోటారు సైకిల్ రూపొందించి అందిస్తున్నట్లు బైనెల్లీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబక్ చెప్పారు. 250 సీసీ బైక్ ద్వారా ప్రీమియం విభాగంలో అందుబాటు ధరలో బైక్ అందిస్తున్నట్లు తెలిపారు. 

2020 చివరికల్లా దేశీయ మార్కెట్‌లో 12-13 మోటారు సైకిళ్ల మోడళ్లను విక్రయించగలమని బైనెల్లి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబక్ అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 మంది డీలర్లు ఉన్నారన్నారు. వీరి సంఖ్యను 60కి పెంచుకుంటామని చెప్పారు. 

బెనెల్లీ బైకుల ధరల శ్రేణి రూ.2.99-6.2 లక్షలు ఉంటుంది. బెనెల్లీ బైకుల కిట్‌లను దిగుమతి చేసుకుని హైదరాబాద్‌కు చెందిన ఆదీశ్వర్‌ ఆటోరైడ్‌ ఇండియా (ఏఏఆర్‌ఐ) హైదరాబాద్‌ యూనిట్‌లో అసెంబ్లింగ్‌ చేస్తోంది. దేశంలో బెనెల్లీ ప్రీమియం బైకుల పంపిణీకి ఏఏఆర్‌ఐ ఎక్స్‌క్లూజివ్‌ భాగస్వామి. జనవరి నుంచి ఇప్పటి వరకూ 1,000 బైకులను విక్రయించారు.

click me!