జావా బైక్స్ కి పోటీగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ వచ్చేస్తోంది..

By Sandra Ashok Kumar  |  First Published Aug 22, 2020, 5:29 PM IST

కొత్త బైక్ ఈ సంవత్సరంలో చాలా ముందుగానే వస్తుందని భావించారు. కానీ  కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మీటియోర్ ఆలస్యం అయింది. కొత్త బైక్ ఇటీవల నిలిపివేసిన థండర్ బర్డ్ ఎక్స్ శ్రేణి మోడళ్లను భర్తీ చేస్తుంది.


రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ వచ్చే నెలలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. కొత్త బైక్ ఈ సంవత్సరంలో చాలా ముందుగానే వస్తుందని భావించారు. కానీ  కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మీటియోర్ ఆలస్యం అయింది.

కొత్త బైక్ ఇటీవల నిలిపివేసిన థండర్ బర్డ్ ఎక్స్ శ్రేణి మోడళ్లను భర్తీ చేస్తుంది. మీటియోర్ బైక్ బాబర్ స్టైల్ ఎలిమెంట్స్‌తో పాటు బ్రాండ్ రెట్రో డిజైన్‌ను పొందింది. పెద్ద ఇంధన ట్యాంక్, రౌండ్ హెడ్‌ల్యాంప్, టైల్లెంప్స్, టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ కలిగి ఉంది.

Latest Videos

undefined

వెనుక భాగంలో టర్న్ ఇండికేటర్ అసెంబ్లీ బాబర్-లుక్స్‌కు జోడిస్తుంది. ఇతర ఫీచర్స్ బ్లాక్-అవుట్ ఎగ్జాస్ట్, విస్తృత రైడర్, పిలియన్ సీట్లు, హ్యాండిల్‌ బార్లు, స్ప్లిట్ రియర్ గ్రాబ్ ట్రాక్స్ ఉన్నాయి. బైక్ సరికొత్త సింగిల్-పాడ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. డిజిటల్ డిస్ ప్లేతో అనలాగ్ స్పీడోమీటర్, టాకోమీటర్ ఉంది.

ఓడిఓ మీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గేజ్, డిస్టెన్స్ టూ ఎంప్టీ, యావరేజ్ స్పీడ్ ,గేర్ ఇండికేటర్ వంటి సమచారాన్ని తెలియజేస్తుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీని సపోర్ట్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

also read 

ఇదే గనుక జరిగితే రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ ఈ బ్రాండ్ నుంచి రానున్న మొట్టమొదటి బ్లూటూత్ ఎనేబుల్డ్ మోటార్‌సైకిల్‌గా మారుతుంది. ఈ మోటార్‌సైకిల్‌పై స్విచ్‌గేర్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. ఇది డిజిటల్ కెమెరా ఆపరేటింగ్ స్విచ్‌ను పోలి ఉండే స్విచ్‌లను కలిగి ఉంటుంది.

ఇందులో కుడివైపు ఇంజన్ ఆన్,ఆఫ్ స్విచ్ ఎడమ వైపు లైటన్ ఆన్,ఆఫ్ స్విచ్‌లు ఉంటాయి. బైక్ పై స్విచ్‌గేర్ కూడా సవరించింది. ఇప్పుడు హ్యాండిల్‌బార్‌కు ఇరువైపులా రెండు రౌండ్ డయల్‌ కూడా ఉన్నాయి. పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడుతూ మీటియోర్ ప్రస్తుత 350 యుసిఇ యూనిట్ ఆధారంగా సరికొత్త ఇంజిన్‌తో వస్తుంది.

ఇంజిన్ లో కొత్త సెటప్ ప్రస్తుత యుసిఇ యూనిట్లతో పోలిస్తే మరింత మెరుగైన ఇంధన సామర్థ్యం, మెరుగైన పనితీరును అందిస్తుంది. ప్రస్తుత 346 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ 19.1 బిహెచ్‌పి, 28 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌ అమర్చారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ నగరంలో, హైవేలలో ప్రయాణించడానికి సౌకర్యవంతమైన బైక్ కోసం చూస్తున్నవారి  అవ్స్సరాన్ని తీర్చగలదు. లాంచ్ అయిన తర్వాత జావా 300, బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 తో పాటు ఇతర వాటితో పోటీపడుతుంది.  
 

click me!