బైక్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. హార్లే-డేవిడ్సన్ ప్లాంట్ మూసివేత.. ?

By Sandra Ashok KumarFirst Published Aug 20, 2020, 3:05 PM IST
Highlights

అమెరికన్ కంపెనీ హార్లే-డేవిడ్సన్ 2009లో మన దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇటీవల సంస్థ దేశంలో 10 సంవత్సరాలుగా విజయవంతమైన కార్యకలాపాలను పూర్తి చేసింది. 

భారతదేశంలో హై-ఎండ్ బైక్ ప్రీమియం తయారీ, అంతర్జాతీయ మోటారుసైకిల్ బ్రాండ్లలో హార్లే-డేవిడ్సన్ ఒకటి. అమెరికన్ కంపెనీ హార్లే-డేవిడ్సన్ 2009లో మన దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇటీవల సంస్థ దేశంలో 10 సంవత్సరాలుగా విజయవంతమైన కార్యకలాపాలను పూర్తి చేసింది.

ప్రపంచ ప్రఖ్యాత పొందిన సంస్థ విశ్వసనీయ కస్టమర్ల అవసరాలను తీర్చడానికి మన దేశంలో మోటారు సైకిళ్ల అమ్మకాలను కొనసాగించడానికి బిఎస్ 6-కంప్లైంట్ మోడళ్ బైకులను విడుదల చేసింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా హార్లే-డేవిడ్సన్ సంస్థ కీలక నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తుంది.

ఎందుకంటే తాజా నివేదికల ప్రకారం హార్లే-డేవిడ్సన్ వచ్చే నెలలో భారతదేశంలో తన తయారీ ప్లాంట్ మూసివేయనున్నారు.  కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా బైక్ అమ్మకాలు పడిపోవడంతో భారతదేశ కార్యకలాపాల నుంచి నిష్ర్కమించాలని భావిస్తోంది.

హర్యానాలోని బావాల్ వద్ద తన ప్లాంట్ ను త్వరలోనే మూసివేయనుంది. ఈ మేరకు ఔట్‌సోర్సింగ్ ఒప్పందం నిమిత్తం కొంతమంది వాహన తయారీదారులను సంప్రదించినట్లు సమాచారం. గత నెలలో రెండవ త్రైమాసిక ఫలితాల సందర్భంగా హార్లే-డేవిడ్సన్ ఈ సంకేతాలు అందించింది.

also read 

కొత్త సీఈఓ మార్గదర్శకత్వంలో హార్లే-డేవిడ్సన్ ‘ది రివైర్’ అని పిలువబడే కొన్ని చర్యలను అమలు చేస్తున్నారు, ఇది రాబోయే నెలల్లో మరింత అభివృద్ధి చెందుతుంది, అలాగే కొత్త వ్యూహాత్మక ప్రణాళికకు దారితీస్తుంది. ఈ ప్రణాళికలో భాగంగా యూరప్, చైనా, యుఎస్ వంటి ప్రాధమిక మార్కెట్లపై కంపెనీ మొత్తం దృష్టి పెట్టనుంది.

తాజా నివేదికల ఆధారంగా ప్రపంచ పునర్నిర్మాణంలో భాగంగా ఆసియా ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సజీవ్ రాజశేఖరన్, హార్లే-డేవిడ్సన్ సింగపూర్‌కు బదిలీ కానున్నరు. హార్లే డేవిడ్సన్ ఇండియాలో గత ఆర్థిక సంవత్సరంలో 2,500 కన్నా తక్కువ యూనిట్లు విక్రయించింది.

2018 లో విక్రయించిన 3,413 యూనిట్లతో పోలిస్తే 2019 లో 22 శాతం తగ్గి 2,676 యూనిట్లకు చేరుకోగా,  2020 ఏప్రిల్- జూన్ మధ్య కేవలం 100 బైక్‌లను మాత్రమే విక్రయించినట్టు కంపెనీ తాజా నివేదికలో తెలిపింది.

హార్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 750 ధరను రూ.65 వేల తగ్గింపు ఆఫర్ అందిస్తుంది. అలాగే వి- ట్విన్ బైక్ ప్రారంభ ధర రూ.5.34 లక్షలు అయితే ఇప్పుడు దీనిని  రూ.4.69 లక్షలకు తగ్గించారు.
 

click me!