ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 బైకును దేశంలోని అన్నీ డీలర్‌షిప్ ద్వారా అందుబాటులోకి తేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 చెన్నైకి చెందిన బైక్ తయారీ సంస్థ నుండి వస్తున్న కొత్త గ్లోబల్ మోడల్, దీనిని థండర్ బర్డ్ 350 లైనప్‌లో భర్తీ చేస్తుంది.
బైక్ రైడర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ వచ్చేస్తోంది. ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 బైకును దేశంలోని అన్నీ డీలర్‌షిప్ ద్వారా అందుబాటులోకి తేస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 చెన్నైకి చెందిన బైక్ తయారీ సంస్థ నుండి వస్తున్న కొత్త గ్లోబల్ మోడల్, దీనిని థండర్ బర్డ్ 350 లైనప్‌లో భర్తీ చేస్తుంది. ఈ బైక్ ధర ఇప్పటికీ ఒక పెద్ద రహస్యంగానే ఉంది.
undefined
కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్ల కోసం నిర్మించారు. ఈ బైక్ స్టయిలింగ్ ఫీచర్లలో ఒక స్టెప్-అప్ అవుతుంది.
ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, కొత్త టైల్ లైట్లు, అల్లాయ్ వీల్స్, యూఎస్‌బి ఛార్జింగ్, డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ తో వస్తుందని భావిస్తున్నారు. అంతే కాకుండా బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ అందిస్తున్నారు.
also read
ఈ ఫీచర్స్ బట్టి ధర కాస్త ఎక్కువగా ఉంటుందని అంచనా. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 ధర సుమారు రూ 1.70 లక్షల నుండి రూ.2 లక్షల వరకు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్ ఇండియా) ప్రారంభమవుతుందని ఆశిస్తున్నారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర రూ.1.65 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 బిఎస్ 4 థండర్ బర్డ్ ధర కంటే ఎక్కువే ఉండొచ్చు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 ఫైర్‌బాల్, స్టెల్లార్, సూపర్నోవా అనే వేర్వేరు వేరియంట్‌లలో లభిస్తుంది.కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 బైక్ 350 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో 20.2 బిహెచ్‌పి, 27 ఎన్‌ఎమ్ పీక్ టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది.
ఈ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో డ్యూయల్ షాక్‌లు, ట్యూబ్ లెస్ టైర్లతో వస్తుంది. ఈ బైక్ కొత్త హోండా హన్నెస్ సిబి 350, జావా, బెనెల్లి ఇంపీరియల్ 400 లతో పోటీ పడనుంది.