స్మార్ట్‌ఎక్స్ టెక్నాలజీ, న్యూలుక్ లో టీవీఎస్ కొత్త అపాచీ ఆర్టీఆర్

By Sandra Ashok KumarFirst Published Nov 5, 2020, 2:59 PM IST
Highlights

టీవీఎస్  భారతదేశంలో కొత్త అపాచీ ఆర్‌టి‌ఆర్ 200 4వి (డ్యూయల్-ఛానల్ ఎబిఎస్) ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో కొత్త టివిఎస్ బైక్ ధర రూ.1.31 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ) నుండి ప్రారంభమవుతుంది.

 ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ  టీవీఎస్  భారతదేశంలో కొత్త అపాచీ ఆర్‌టి‌ఆర్ 200 4వి (డ్యూయల్-ఛానల్ ఎబిఎస్) ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో కొత్త టివిఎస్ బైక్ ధర రూ.1.31 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ) నుండి ప్రారంభమవుతుంది.

గత నెలలో అపాచీ బ్రాండ్ 4 మిలియన్ గ్లోబల్ సేల్స్ మైలురాయిని దాటింది, డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌తో కూడిన కొత్త టివిఎస్ అపాచీ ఆర్‌టి‌ఆర్ 200 4విను  గ్లోస్ బ్లాక్, పెర్ల్ వైట్, మాట్టే బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్స్ లో లభిదిస్తుంది.

టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ (మార్కెటింగ్) ప్రీమియం మోటార్ సైకిల్స్ మేఘశ్యామ్ దిఘోల్ మాట్లాడుతూ, "2005లో ప్రారంభమైనప్పటి నుండి మా కస్టమర్లకు, రేసింగ్ ఔత్సాహికులకు టెక్నోలజికల్  పవర్ అందించాలనే మా నిబద్ధతకు అపాచీ సిరీస్ ఒక నిదర్శనం. మా కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వి బైకును లాంచ్  ని మేము సంతోషిస్తున్నాము. "

బీఎస్-6 ప్రమాణాలకు  అనుగుణంగా  కొత్త ఫీచర్లు, అధునిక టెక్నాలజీతో రూపొందించిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ  బైక్‌ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. స్పెషల్ ఎడిషన్ బైక్‌లో తొలిసారి రైడ్‌ మోడ్‌ను పరిచయం చేసింది. స్పోర్ట్, అర్బన్,  రెయిన్ అనే మూడు రైడ్ మోడ్‌లతో దీన్ని భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

also read  

అయితే ధరను మాత్రం పాత దానితో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బుకింగ్, డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ పండుగ సీజన్‌లో కస‍్టమర‍్లను ఆకట్టుకునేలా ఈ కొత్త బైక్‌ను కొత్త డిజైన్ లో తీసుకొచ్చింది. 

ఎల్‌ఈడీ టెక్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, హై పెర్ఫార్మెన్స్ రియర్ రేడియల్ టైర్లు, రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, రేస్ ట్యూన్డ్ స్లీపర్ క్లచ్, స్లైడ్ త్రూ టెక్నాలజీ ఉన్నాయి. దీనితో పాటు ఎడ్జస్టబుల​ ఫ్రంట్ సస్పెన్షన్ లివర్‌ను జోడించింది.

అంతేకాదు  బ్లూటూత్‌తో కూడిన స్మార్ట్‌ఎక్స్ కనెక్ట్ టెక్నాలజీని అపాచీ ఆర్‌టి‌ఆర్ 200  4వీలో అమార్చింది. దీని ద్వారా యాప్‌ను మొబైల్‌కు కనెక్ట్ చేయవచ్చు. దీని ద్వారా బైక్‌కు సంబంధించిన చాలా సమాచారం తీసుకోవచ్చు.  
 
స్పోర్ట్ మోడ్‌లో 9,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 20.5 బిహెచ్‌పి శక్తిని, అర్బన్, రెయిన్ మోడ్‌లలో 7,800 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పి శక్తిని అందించే 197.75 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో ఈ బైక్ వస్తుంది. స్పోర్ట్ మోడ్‌లోని పీక్ టార్క్ 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 17.25 ఎన్‌ఎమ్, ఇతర మోడ్‌లలో 16.51 ఎన్‌ఎమ్ వద్ద 5,750 ఆర్‌పిఎమ్ వద్ద రేట్ చేయబడింది.

click me!