మీరు రెట్రో లుక్ లో కనిపించే వెస్పా స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే పియాజియో సంస్థ నుంచి వస్తున్న సరికొత్త వెస్పా జీటీవీ స్కూటర్ మార్కెట్లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ స్కూటర్ స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం.
Vespa GTV: ప్రముఖ టు వీలర్ సంస్థ పియాజియో తన కొత్త స్కూటర్ వెస్పా జిటివి(Vespa GTV)ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ శక్తివంతమైన స్కూటర్‌లో 300 సీసీ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ తో పాటు కంపెనీ ఈ స్కూటర్‌లో ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉంచింది.
Vespa GTV రోడ్డుపై 23.4 bhp శక్తిని, 26 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇది కంపెనీ రెట్రో లుక్ స్కూటర్ కావడం విశేషం. ఇది ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లో లాంచ్ చేశారు. ఇది భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెడతారో ఇంకా వెల్లడి కాలేదు.
undefined
Vespa GTVలో LED లైట్లు ప్రత్యేక ఆకర్షణ
Vespa GTVలో LED లైట్లు అందించారు. ఈ కొత్త స్కూటర్ మాట్ బ్లాక్ డిజైన్ థీమ్ ఆధారంగా రూపొందించారు. విలాసవంతమైన ఈ స్కూటర్‌లో అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్ కవర్, గ్రాబ్రెయిల్, రియర్‌వ్యూ మిర్రర్, ఫుట్‌రెస్ట్ మ్యాట్ బ్లాక్ కలర్‌లో ఇచ్చారు. కీలెస్ స్టార్ట్-స్టాప్ ఆప్షన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ABS , USB ఛార్జింగ్ పోర్ట్ వంటి అడ్వాన్స్ ఫీచర్లు ఈ స్కూటర్‌లో అందుబాటులో ఉన్నాయి.
Vespa GTV స్కూటర్ కలర్లు ఇవే..
Vespa GTV స్కూటర్‌లో ప్రస్తుతం రెండు రంగులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే కంపెనీ తన స్కూటర్ వెస్పా VXL 125 డ్యూయల్ కలర్‌ను విడుదల చేసింది. Vespa VXL 125 ప్రారంభ ధర రూ. 1,49,278 లక్షలు ఎక్స్-షోరూమ్. ఇందులో 124.45cc BS6 ఇంజన్ ఉంది.
వెస్పా VXL 125 9.65 bhp శక్తిని, 10.11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ముందువైపు డిస్క్ బ్రేక్ , వెనుకవైపు డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. స్కూటర్ సీటు ఎత్తు 770 మిమీ. దీని కారణంగా తక్కువ ఎత్తు ఉన్నవారు కూడా సులభంగా నడపగలరు.
7.4 లీటర్ ఇంధన ట్యాంక్
వెస్పా VXL 125 మొత్తం బరువు 115 కిలోలుగా ఉంది. ఇది 7.4 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కంపెనీ రెట్రో స్టైల్ స్కూటర్. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, యూఎస్‌బీ ఛార్జర్, 10-అంగుళాల వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో ముందువైపు సింగిల్ సైడ్ ఆర్మ్ సస్పెన్షన్, వెనుక వైపున హైడ్రాలిక్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. దీని కారణంగా రైడర్ రోడ్లపై కుదుపులకు గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది.