ద్విచక్ర వాహనాలపై దీపావళి ఫెస్టివల్ సీజన్ ఆఫర్.. డిస్కౌంట్లు, ఈ‌ఎం‌ఐ ఆఫర్లతో పాటు క్యాష్ బ్యాక్ కూడా..

By Sandra Ashok KumarFirst Published Nov 3, 2020, 11:07 AM IST
Highlights

 ద్విచక్ర వాహన తయారీదారుల సంస్థలు మంచి సేల్స్ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి.  హీరో మోటోకార్ప్ అక్టోబర్‌లో అత్యధికంగా సేల్స్ నమోదు చేసింది, సుమారు 8.06 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. 

దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో ద్విచక్ర వాహన తయారీదారుల సంస్థలు మంచి సేల్స్ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి.  హీరో మోటోకార్ప్ అక్టోబర్‌లో అత్యధికంగా సేల్స్ నమోదు చేసింది, సుమారు 8.06 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.

అలాగే ఇతర ద్విచక్ర వాహన తయారీదారుల సంస్థలు కూడా మంచి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. చాలా వరకు ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వాటి మోడల్స్ పై  ఆకర్షణీయమైన డిస్కౌంట్,  ఆఫర్లను అందిస్తున్నారు. వాహన సంస్థలు అందిస్తున్న కొన్ని ఉత్తమ ఆఫర్లు, డిస్కౌంట్లు ఎంటో ఒకసారి చూద్దాం..

హీరో మోటోకార్ప్
పండుగ సీజన్ లో హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ సేల్స్ పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం కొన్ని పథకాలను, ఆఫర్లను ప్రవేశపెట్టింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్  పై  2వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.3వేలు, లాయల్టీ బోనస్ రూ.2,000 ఇస్తున్నాయి.

అదేవిధంగా, ఒక కస్టమర్ ఐసిఐసిఐ క్రెడిట్ / డెబిట్ కార్డును ఉపయోగిస్తే వారికి రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పేటీఎం ద్వారా చెల్లింపు చేయాలనుకుంటే మీరు రూ.7,500 క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. బిఎస్ 6 మోడల్స్ పై తక్కువ వడ్డీ రేటు, ఇఎంఐ స్కీమ్ రూ.4,999 కంటే తక్కువ ఆఫర్ చేస్తోంది.  

హోండా మోటార్స్
హోండా మోటార్స్ సంస్థ కొత్త హోండా హెచ్-నెస్ సిబి 350 కొనుగోలుపై   రూ.43,000 వరకు సేవింగ్ అందిస్తోంది. ఇందుకోసం కంపెనీ ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకుంది. బైక్ ఆన్-రోడ్ ధరపై 100 శాతం ఫైనాన్స్‌ను అందిస్తుంది. వడ్డీ రేటు 5.6 శాతం, ఇది ద్విచక్ర వాహన ఫైనాన్స్‌పై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లలో దాదాపు సగం.

ఈ ఫైనాన్స్ స్కీమ్ ఎంచుకోవడం వల్ల మొత్తం రూ.43,000 వరకు ఆదా అవుతుంది. కస్టమర్లు రూ.4,999 నుండి ప్రారంభమయ్యే ఈ‌ఎం‌ఐ కూడా ఎంచుకోవచ్చు. హోండా సూపర్ 6 ఫెస్టివల్ సీజన్ ఆఫర్ ఆరు వేర్వేరు ఆఫర్లను, రూ.11,000 వరకు సేవింగ్ అందిస్తుంది, ఇందులో ఫైనాన్స్ స్కీమ్‌లపై తక్కువ వడ్డీ రేటు, అలాగే మొదటి మూడు నెలలకు ఇఎంఐలపై 50 శాతం తగ్గింపు ఉంటుంది.

టీవీఎస్ మోటార్స్ 
టీవీఎస్ మోటార్ కంపెనీ  స్కూటర్ లైనప్‌లో జూపిటర్, స్కూటీ పెప్ ప్లస్, స్కూటీ జెస్ట్ 110, ఫ్లాగ్‌షిప్ ఎన్‌టోర్క్ 125 లను ఉన్నాయి. ఈ స్కూటర్ల  కొనుగోలు పై వినియోగదారులు రూ.4,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.  

కంపెనీ డౌన్‌ పేమెంట్‌ను కూడా రూ.10,999 కు తగ్గించింది. అదనంగా టీవీఎస్ స్కూటర్లలో బడ్జెట్ ఈ‌ఎం‌ఐ స్కీమ్ కూడా అందిస్తోంది. జూపిటర్ స్కూటి ఈ‌ఎం‌ఐ 2,222, జెస్ట్ స్కూటీ, స్కూటీ పెప్ ప్లస్ ఈ‌ఎం‌ఐ రూ.1,666 నుండి ప్రారంభమవుతాయి.

అలాగే స్కూటీ జెస్ట్ 110, స్కూటీ పెప్ ప్లస్ పై 100 శాతం ఫైనాన్స్ పొందవచ్చు. ఐసిఐసిఐ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉన్న కస్టమర్లు, వారు ఎంచుకున్న కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఒకినావా 
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఒకినావా భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించింది. ఒకినావా స్కూటర్ల కస్టమర్లకు లక్కీ డ్రా ప్రకటించింది. లక్కీ డ్రా కింద 10 మంది కస్టమర్లను సెలెక్ట్ చేస్తారు, మొదటి లక్కీ విజేతకు ఒకినావా ఆర్ 30 స్లో స్పీడ్ స్కూటర్‌ను బహుమతిగా ఇంటికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది.

ఈ ఆఫర్ నవంబర్ 15 వరకు చెల్లుతుంది. లక్కీ డ్రా విజేతలను నవంబర్ 30న ప్రకటిస్తారు. ఒకినావా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ప్రతి బుకింగ్‌తో ఖచ్చితమైన బహుమతులు కూడా ప్రకటించారు. కొనుగోలుదారులు వారి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ బుకింగ్‌లపై 6,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను కూడా పొందుతారు.
 

click me!