మారుతి సుజుకి ఎండి & సిఇఒకి సియామ్ అధ్యక్షుడిగా పదవి..

By Sandra Ashok Kumar  |  First Published Sep 5, 2020, 4:35 PM IST

2013 నుండి దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఎండి, సిఇఒగా ఉన్న కెనిచి ఆయుకావా, రాజన్ వధేరా తరువాత అతని స్థానంలో నియమితులయ్యారు. కెనిచి ఆయుకావా ఇంతకు ముందు ఎస్‌ఐ‌ఏ‌ఎం ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. 


సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (ఎస్‌ఐ‌ఏ‌ఎం) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ రోజు మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెనిచి ఆయుకావాను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది.

2013 నుండి దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఎండి, సిఇఒగా ఉన్న కెనిచి ఆయుకావా, రాజన్ వధేరా తరువాత అతని స్థానంలో నియమితులయ్యారు. కెనిచి ఆయుకావా ఇంతకు ముందు ఎస్‌ఐ‌ఏ‌ఎం ఉపాధ్యక్షుడిగా కొనసాగారు.

Latest Videos

undefined

also read  ఇండియన్ రోడ్స్ కోసం పియాజియో కొత్త స్కూటర్.. ...

ఈ రోజు ముందు నిర్వహించిన ఎస్‌ఐ‌ఏ‌ఎం 60వ వార్షిక సదస్సులో కెనిచి ఆయుకావా మాట్లాడుతూ, "ఆటొమొబైల్ పరిశ్రమ మంచి అభివృద్ధి కోసం ఎదురుచూస్తోంది అంటే ఉత్పత్తి, అమ్మకాలు, ఎగుమతులు, ఎలక్ట్రానిక్స్‌తో సహా వీడి భాగాలు ఎక్కువగా స్థానికరణతో ఉత్పత్తి చేయాలి. అంటే స్వావలంబన దీని అర్థం ఆత్మనిర్భర్ భారత్ " అని అన్నారు.

సియామ్ వార్షిక సర్వసభ్య సమావేశం తరువాత జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కొత్త ఆఫీసు బేరర్లకు ఎన్నికలు జరిగాయి. ఆటొమొబైల్ పరిశ్రమల నూతన ఉపాధ్యక్షుడిగా ఎస్‌ఐ‌ఏ‌ఎం సభ్యులు అశోక్ లేలాండ్ ఎండి, సిఇఒ విపిన్ సోంధీని ఎన్నుకున్నారు.

అంతేకాకుండా వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ ఎండి, సిఇఒ వినోద్ అగర్వాల్ ఎస్‌ఐ‌ఏ‌ఎం కోశాధికారిగా కొనసాగుతారు.
 

click me!