కవాసాకి కొత్త నింజా 650 బైక్ ఇప్పుడు బిఎస్ 6 అప్ డేట్ తో భారతదేశంలో రూ.6.24 లక్షల రూపాయలకు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. కవాసాకి నింజా 650 బిఎస్ 6 ధర బిఎస్ 4 కంటే దాదాపు రూ .35,000 అధిక ధరతో వస్తుంది.
కొత్త కవాసాకి నింజా 650 బైక్ బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్ డేట్ చేసి లాంచ్ అయ్యింది. ఇది 649 సిసి, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, ప్యారలల్ ట్విన్, ఎఫ్‌ఐ (ఫ్యూయల్ ఇంజెక్షన్) ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 68 పిఎస్, 64 ఎన్ఎమ్ పీక్ టార్క్ అభివృద్ధి చేస్తుంది.
కవాసాకి కొత్త నింజా 650 బైక్ ఇప్పుడు బిఎస్ 6 అప్ డేట్ తో భారతదేశంలో రూ.6.24 లక్షల రూపాయలకు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. కవాసాకి నింజా 650 బిఎస్ 6 ధర బిఎస్ 4 కంటే దాదాపు రూ .35,000 అధిక ధరతో వస్తుంది.
అప్ డేట్ చేసిన ఇంజన్ కాకుండా, 2020 మోడల్ కవాసాకి నింజా 650 లేటెస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఇది లైమ్ గ్రీన్ ఎబోనీ, పెర్ల్ ఫ్లాట్ స్టార్‌డస్ట్ వైట్ కలర్ అనే రెండు ఆప్షన్లలో లభిస్తుంది.
కొత్త కవాసాకి నింజా 650 బిఎస్ 6 బైక్ 649 సిసి, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, ప్యారలల్ ట్విన్, ఎఫ్‌ఐ (ఫ్యూయల్ ఇంజెక్షన్) ఇంజన్, ఇది 68 పిఎస్, 64 ఎన్ఎమ్ పీక్ టార్క్ అభివృద్ధి చేస్తుంది.
also read మారుతి సుజుకి టయోటాకు మధ్య కుదిరిన ఒప్పందం.. ఎస్‌యూవీల విక్రయనికి అనుమతి
నింజా 650 బిఎస్ 6 ఇంజన్ ఇప్పుడు బిఎస్ 6-కంప్లైంట్ చేయడానికి కొత్త ఎయిర్‌బాక్స్, ఎగ్జాస్ట్ సిస్టమ్, 6-స్పీడ్ ట్రాన్స్మిషన్కు గేర్ బాక్స్ దీనికి అమర్చారు. హై-టెన్సైల్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై కూర్చుంది. సస్పెన్షన్ పరంగా 125ఎంఎం వీల్ ట్రావెల్ తో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు 130 ఎంఎం వీల్ ట్రావెల్ తో మోనోషాక్ దీనికి వస్తుంది.
కొత్త 17 అంగుళాల డన్‌లాప్ స్పోర్ట్‌మాక్స్ రోడ్‌స్పోర్ట్ 2 టైర్లతో వస్తుంది. ముందు భాగంలో 300 ఎంఎం డ్యూయల్ సెమీ ఫ్లోటింగ్ పెటల్ డిస్క్‌లు, వెనుక భాగంలో 220 ఎంఎం సింగిల్ పెటల్ డిస్క్ లభిస్తుంది.కొత్త కవాసాకి నింజా ముందు భాగం రిడిజైన్ చేశారు, ఇది మరింత కొత్త లుక్ కనిపిస్తుంది.
హెడ్‌లైట్‌లో రెండు ఎల్‌ఈడీ లైట్ సెటప్, రిడిజైన్ విండ్‌షీల్డ్ ఉంటాయి. ఇంటర్నల్ బ్లూటూత్ టెక్నాలజీతో కొత్త కలర్ డిజిటల్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ పానెల్ ఉంది. పివిలియన్ సీటు కూడా రిడిజైన్ చేశారు, అంతకుముందు కంటే కాస్త వెడల్పుగా ఉంటుంది.