హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మొదటిసారి బిఎస్ 6 కంప్లైంట్ డియో స్కూటర్ ధరలను అప్‌డేట్ చేసింది. 2020 మోడల్ హోండా డియో స్టాండర్డ్ వెర్షన్ కోసం ఇప్పుడు 60,542 చెల్లించాలి.
ఆటోమొబైల్ దిగ్గజం ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా డియో బిఎస్ 6 2020 మోడల్ ధర పెంచింది. ఇప్పుడు బిఎస్ 6 గల హోండా డియో వాహనంపై రూ. 552 పెరుగుదలతో ప్రస్తుత ధర రూ. 60,542 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), లాక్ డౌన్ తరువాత సెలెక్టెడ్ డీలర్‌షిప్‌ల వద్ద కంపెనీ కార్యకలాపాలను కూడా తిరిగి ప్రారంభించింది.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మొదటిసారి బిఎస్ 6 కంప్లైంట్ డియో స్కూటర్ ధరలను అప్‌డేట్ చేసింది. 2020 మోడల్ హోండా డియో స్టాండర్డ్ వెర్షన్ కోసం ఇప్పుడు 60,542 చెల్లించాలి. కొత్తగా రూ.552 ధరల పెరుగుదలతో కొత్త నమోదైంది.
డియోలో రేంజ్-టాపింగ్ డీలక్స్ వేరియంట్ కోసం ఇప్పుడు రూ.63,892 (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని వారాల క్రితం హోండా యాక్టివా 6జి, యాక్టివా 125, ఎస్‌పి 125 వాహన ధరలలో కూడా పెరుగుదల నమోదైంది.
ధరల పెరుగుదలను మినహాయించి, 2020 హోండా డియో బిఎస్ 6లో ఎటువంటి కొత్త మార్పులు రావు. హోండా డియో స్కూటర్ 110 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్, ఫ్యుయెల్-ఇంజెక్షన్, 7.68 బిహెచ్‌పి, 8.79 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది.
ఇంధన సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో హోండా ఎకో టెక్నాలజీ (హెచ్‌ఇటి) తో పాటు కొత్త సాంకేతికత, మెరుగైన స్మార్ట్ పవర్ (ఇఎస్‌పి) తో సహా ఇంజన్ గణనీయమైన మార్పులను పొందింది. హోండా కొత్త సైలెంట్ స్టార్టర్ మోటర్, స్టార్ట్-స్టాప్ స్విచ్‌ను కూడా దీనికి ఉంది.
also read సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఓలా కంపెనీ భారీ విరాళం
ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, రియల్ టైమ్ ఫ్యూయల్ ఎకానమీతో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ , ఎకో ఇండికేటర్ ఇంకా కొన్ని మార్పులు ఉన్నాయి. ఇవి మినహా 2020 హోండా డియోలో ఇతర ఫీచర్స్ అన్నీ ఒకే విధంగా ఉన్నాయి.
110 సిసి స్కూటర్‌కు ఎక్స్ టర్నల్ ఫ్యుయెల్ క్యాప్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్, గోల్డ్ ఫినిష్ వీల్స్ లభిస్తాయి. స్కూటర్ 12-అంగుళాల ఫ్రంట్ వీల్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో మూడు విధాల అడ్జస్టబుల్ సస్పెన్షన్‌పై నడుస్తుంది.
ఈ మోడల్ బైక్ కి కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (సిబిఎస్) స్టాండర్డ్ గా వస్తుంది. హోండా డియోను స్టాండర్డ్ మోడల్‌లో నాలుగు కలర్ ఆప్షస్ ఉంటాయి, డీలక్స్ వెర్షన్‌లో మూడు మెటాలిక్ కలర్ ఆప్షన్లు ఉంటాయి. స్పోర్టి స్కూటర్ కోసం చూస్తున్న యువతలో హోండా డియో ఒక మంచి ఆప్షన్, ధరల పెరుగుదల దాని జనాదరణపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది.
సెలెక్ట్ చేసిన ప్రదేశాలలో డీలర్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఇటీవల కంపెనీ ప్రకటించింది. కంపెనీ డీలర్ షిప్, ఔట్‌లెట్లలో తమ ఉద్యోగులు, ఖాతాదారుల ఆరోగ్యాన్ని కాపాడటానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని కంపెనీ తెలిపింది.