పండుగ సీజన్ లో బైక్ డెలివరీకి భరోసా ఇస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా బుధవారం ఒక ట్వీట్ ద్వారా ఈ సమాచారం ఇచ్చారు. మహీంద్రా & మహీంద్రా క్లాసిక్ లెజెండ్స్ చారిత్రక మోటారుసైకిల్ బ్రాండ్ జావాను దేశంలో కొత్తగా పరిచయం చేశామని తెలిపారు.
ఈ దీపావళికి మీరు మీ ఇంటికి కొత్త బైక్ తీసుకురావాలనుకుంటున్నార, అయితే అత్యంత ప్రాచుర్యం పొందిన బైకును సులభమైన ఈఎంఐ వాయిదాలతో పొందోచ్చు. అవును మీరు విన్నది నిజమే, ఈ పండుగ సీజన్‌లో కేవలం 4,444 రూపాయల ఈఎంఐతో జావా బైక్‌లను కొనుగోలు చేయవచ్చు.
పండుగ సీజన్ లో బైక్ డెలివరీకి భరోసా ఇస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా బుధవారం ఒక ట్వీట్ ద్వారా ఈ సమాచారం ఇచ్చారు. మహీంద్రా & మహీంద్రా క్లాసిక్ లెజెండ్స్ చారిత్రక మోటారుసైకిల్ బ్రాండ్ జావాను దేశంలో కొత్తగా పరిచయం చేశామని తెలిపారు.
undefined
జావా బైకును మూడు కొత్త మోడళ్లలో మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో జావా 300తో సహా జావా 42, జావా పెరాక్ ఉన్నాయి.
also read
భారతదేశంలో జావా బైక్స్ మోడళ్ల ధరల గురించి చెప్పాలంటే జావా 42 ధర రూ .1,65,000 (ఎక్స్-షోరూమ్) కాగా, జావా పెరాక్ ధర 1,89,000 రూపాయలు (ఎక్స్-షోరూమ్). జావా 300 (ఎక్స్-షోరూమ్) ధర రూ .1,74000. మీరు జావా పెరాక్ సెల్ఫ్-స్టార్ట్ మోడల్ కావాలనుకుంటే దీనికి 334.0 సిసి ఇంజన్, 30.22 బిహెచ్‌పితో 35 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.
జావా 42 బైకుకి 293.0 సిసి ఇంజన్, 27.00 బిహెచ్‌పితో గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 37.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ సెల్ఫ్ స్టార్ట్ తో ఫ్యుయెల్ ఇంజెక్షన్, 6 స్పీడ్ గేర్ ట్రాన్స్మిషన్ ఉంది. జావా 300 బైకుకి 293.0 సిసి ఇంజన్, 26.0 బిహెచ్‌పి, ఆర్‌పిఎం ఉత్పత్తి చేస్తుంది. సెల్ఫ్ స్టార్ట్, 6 స్పీడ్ గేర్ ట్రాన్స్మిషన్, మైలేజ్ విషయానికొస్తే 37.5 కిలోమీటర్లు ఇస్తుంది.
జావా బైక్స్ కలర్ వేరియంట్ల గురించి చెప్పాలంటే బ్లాక్, గ్రే, మెరూన్ అనే 3 రంగులలో లభిస్తుండగా, 6 రంగులలో జావా 42 లభిస్తుంది ఇందులో హాలీ టీల్, గెలాక్సీ గ్రీన్, స్టార్‌లైట్ బ్లూ లూమోస్ లైమ్, నెబ్యులా బ్లూ, కామెట్ రెడ్ ఉన్నాయి.