హోండా మోటార్స్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ ఇప్పటికి యాక్టీవా 125, ఎస్పీ 125, యాక్టీవా 6జీ, షైన్, యూనికార్న్, డియో మోడల్ బైక్స్, స్కూటీలు ఉన్నాయి. బీఎస్-6 యుగంలో తమ సంస్థ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ మోడల్ వాహనాలు ఎంతో సహకరిస్తాయని యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్స్ సరికొత్త మైలురాయిని నమోదు చేసింది. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాల అమ్మకం అధికారికంగా అమలు కాకముందే అందులో రికార్డు నమోదు చేసింది. ఇప్పటి వరకు బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన ద్విచక్ర వాహనాలు 5.5 లక్షల యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది.
ఈ మేరకు హోండా మోటార్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులేరియా ఓ ప్రకటనలో తెలిపారు. హోండా నుంచి ఇప్పటి వరకు ఆరు రకాల బీఎస్-6 మోడల్ ద్విచక్ర వాహనాలు విపణిలోకి విడుదలయ్యాయి.
undefined
also read కారు కొనాలంటే కొత్త పద్దతి...కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా...
హోండా మోటార్స్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ ఇప్పటికి యాక్టీవా 125, ఎస్పీ 125, యాక్టీవా 6జీ, షైన్, యూనికార్న్, డియో మోడల్ బైక్స్, స్కూటీలు ఉన్నాయి. బీఎస్-6 యుగంలో తమ సంస్థ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ మోడల్ వాహనాలు ఎంతో సహకరిస్తాయని యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.
తమ ద్విచక్ర వాహనాల విక్రయాలపై తమ సంస్థ ప్రకటించిన ఆరు సంవత్సరాల వారంటే ప్యాకేజీకి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను విక్రయించాలని సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాల విక్రయంలో రికార్డు నెలకొల్పింది హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్. అయితే తన యాక్టీవా 6జీ, బీఎస్- 6 ప్రమాణాలతో కూడిన యాక్టీవా 125, బీఎస్-6 డియో మోడల్ స్కూటర్లను రీకాల్ చేసింది.
also read టయోటా కార్ల ఉత్పత్తి నిలిపివేత...బిఎస్ 6 అప్ డేట్ ఉండదు...
ఎన్ని వాహనాలను రీకాల్ చేసిందన్న సంగతిని మాత్రం హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ ప్రకటించలేదు. అయితే, గత నెల 14-25 మధ్య తయారు చేసిన స్కూటర్లను మాత్రం రీకాల్ చేసింది. ఆయిల్ లీకేజీ లేదా బ్రేకేజీ వంటి అంశాలు ఈ వాహనాల్లో ఇంబేలన్స్‌కు దారి తీశాయి.
ఇదిలా ఉంటే బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన హోండా మోటార్స్ బైక్స్, స్కూటర్లు పూర్తిగా స్మార్ట్ పవర్ టెక్నాలజీ (ఈఎస్పీ) విస్తరణతోపాటు ఇంటిగ్రేటెడ్ ఎసీజీ స్టార్టర్ మోటారు, ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఫ్రిక్షనల్ నష్టాలను తగ్గించడంతోపాటు మైలేజీ పెరిగేలా ఈ వాహనాలను తీర్చిదిద్దారు.