హోండా సంస్థ 2001లో హోండా ఆక్టివా కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి రెండు దశాబ్దాల్లో 25 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని సాధించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్కూటర్ విభాగంలో 72 శాతం మార్కెట్ వాటాతో రాష్ట్రంలోని ద్విచక్ర వాహన మార్కెట్లో ఆధిపత్యం చెలాయించింది.
ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. హోండా సంస్థ 2001లో హోండా ఆక్టివా కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి రెండు దశాబ్దాల్లో 25 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని సాధించింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్కూటర్ విభాగంలో 72 శాతం మార్కెట్ వాటాతో రాష్ట్రంలోని ద్విచక్ర వాహన మార్కెట్లో ఆధిపత్యం చెలాయించింది. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్‌లో భాగమైనప్పటి నుండి అమ్మకాలు నమోదైనట్లు తెలిపింది.
undefined
హెచ్‌ఎంఎస్‌ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యాద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, "గత 5-6 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతంలో యాక్టివా సేల్స్ విస్తరించడం స్కూటరైజేషన్‌లోనే కాకుండా వినియోగదారుల నమ్మకం, ప్రశంసలను కూడా పొందింది.
also read
డియో రెప్సోల్ రేస్ ఎడిషన్ & హార్నెట్ 2.0, యాక్టివా 20వ వార్షికోత్సవ ఎడిషన్ వంటి కొత్త మోడల్ లాంచ్‌లు మా కస్టమర్లను మరింత ఆనందపరుస్తాయి " అని అన్నారు.
హోండా ఏప్రిల్ నుండి నవంబర్ 2020 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో లక్షకు పైగా స్కూటర్లను విక్రయించింది. దేశంలో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలకు స్కూటర్ల విక్రయాలు 29 శాతం తోడ్పడగా, తెలంగాణలో విక్రయాలు 33 శాతానికి పెరిగింది. మొత్తంమీద, రాష్ట్రంలో హోండా ద్విచక్ర వాహన మార్కెట్ వాటా 38 శాతంగా ఉంది.
తెలంగాణలో హోండా మొదటి 10 లక్షల కస్టమర్లను 14 సంవత్సరాలలో నమోదు చేసింది. హోండా 2 వీలర్స్ ఇండియా తెలంగాణలో 430 టచ్ పాయింట్లతో పనిచేస్తోంది.