ఈ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు నగరలలో మాత్రమే డెలివరీలను అందించనుంది. 2021 జనవరి నాటికి తమిళనాడు, కేరళలో ఆ తరువాత మహారాష్ట్ర, ఢీల్లీ ఎన్‌సిఆర్ లో డెలివరీలు ప్రారంభించనుంది.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ సంస్థ వన్ ఎలక్ట్రిక్ తాజాగా 'కేఆర్ఐడిఎన్' ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలను ప్రారంభించింది. ఈ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు నగరలలో మాత్రమే డెలివరీలను అందించనుంది.
2021 జనవరి నాటికి తమిళనాడు, కేరళలో ఆ తరువాత మహారాష్ట్ర, ఢీల్లీ ఎన్‌సిఆర్ లో డెలివరీలు ప్రారంభించనుంది. 95 కిలోమీటర్ల వేగంతో 'కెఆర్ఐడిఎన్' బైక్ భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్ అని వన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ సంస్థ పేర్కొంది.
undefined
ఈ బైక్ ధర రూ.1.29 లక్షలు (ఎక్స్-షోరూమ్). వన్ ఎలక్ట్రిక్ బైక్ పేరు కేఆర్ఐడిఎన్ దీని అర్ధం సంస్కృతంలో 'ప్లే' అని.
also read
కేఆర్ఐడిఎన్ బైకుకి హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది, ఇది 5.5 kW లేదా 7.4 bhp అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎకో మోడ్‌లో 110 కిలోమీటర్లు, సాధారణ మోడ్‌లో 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
ఈ బైక్ ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్ అప్ ఫ్రంట్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ పొందుతుంది. ఈ బైకుకి 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుక భాగంలో 220 ఎంఎం డిస్క్ తో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం అందించారు. కేఆర్ఐడిఎన్ లో స్థానికీకరించిన కంటెంట్ 80 శాతం వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఫీచర్స్ విషయానికొస్తే ఈ బైకుకి డిజిటల్ ఓడోమీటర్‌తో పాటు ఆప్షనల్ బ్లూటూత్ కనెక్టివిటీ, జిపిఎస్ లభిస్తుంది. ఈ బైక్ రెండు వేరియంట్లలో వస్తుంది. ఒకటి కేఆర్ఐడిఎన్, మరొకటి కేఆర్ఐడిఎన్ ఆర్ అయితే ఈ రెండో వెరీఎంట్ బైక్ టాక్సీ సేవలకు, డెలివరీ ఆపరేటర్ల కోసం ఉపయోగించబడుతుంది.
దీనికి 80/100 17 అంగుళాల ట్యూబ్ లెస్ ఫ్రంట్ వీల్, 120/80 16 అంగుళాల ట్యూబ్ లెస్ రియర్ వీల్ ఉంది. ఈ బైక్ కేవలం 8 సెకన్లలో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.