అత్యంత తక్కువ ధరకే దొరికే అడ్వెంచర్ బైక్ వచ్చేసింది..

By Sandra Ashok Kumar  |  First Published Jul 20, 2020, 3:42 PM IST

ప్రముఖ బైక్ బ్రాండ్ హీరో మోటార్ సైకిల్స్ హీరో ఎక్స్‌పల్స్ 200సి‌సి బిఎస్ 6 బైక్ ను లాంచ్ చేసింది. దీని ధర 1,11,790 రూపాయలు (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ), బిఎస్ 4 ఫ్యుయెల్ -ఇంజెక్ట్ మోడల్ కంటే 6,790 రూపాయల ధర దీనికి ఎక్కువ. 


ఇండియాలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు వల్ల రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలలో లాక్ డౌన్ ఇంకా కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ, వినియోగదారుల కోసం కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం, అందించడం కోసం ద్విచక్ర వాహన బ్రాండ్లు ముందుకొస్తున్నాయి.

భారతదేశంలో అడ్వెంచర్ బైక్ చివరకు బి‌ఎస్6 వెర్షన్ లో బడ్జెట్ ధరకే ప్రారంభించారు. ప్రముఖ బైక్ బ్రాండ్ హీరో మోటార్ సైకిల్స్ హీరో ఎక్స్‌పల్స్ 200సి‌సి బిఎస్ 6 బైక్ ను లాంచ్ చేసింది. దీని ధర 1,11,790 రూపాయలు (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ), బిఎస్ 4 ఫ్యుయెల్ -ఇంజెక్ట్ మోడల్ కంటే 6,790 రూపాయల ధర దీనికి ఎక్కువ.

Latest Videos

undefined

రాబోయే వారంలో బిఎస్ 6 ఎక్స్‌పల్స్ 200సి‌సి అన్ని హీరో డీలర్లకు చేరుకుంటుందని, డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని సమాచారం. బిఎస్6 ఎక్స్ పల్స్ బైక్ కోసం బుకింగ్స్  కొన్ని నెలల క్రితమే ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి, లాక్ డౌన్ వల్ల బైక్ త్వరగా అందుబాటులో రాలేకపోయింది.

also read ఇండియన్ ఆర్మీ కోసం 718 జిప్సీ వాహనాలను డెలివరీ చేసిన మారుతి సుజుకి ...

199.6 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తున్న ఎక్స్‌పల్స్ 200 బిఎస్ 6 స్పెసిఫికేషన్లను హీరో మోటర్స్  ప్రకటించింది. ఇప్పుడు ఈ బైక్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 18.08 పిఎస్, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 16.45 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఇంజిన్ ఫ్యుయెల్-ఇంజెక్షన్‌తో మాత్రమే వస్తుంది.

ఇంజిన్ లో మరొక కీలకమైన అప్ డేట్ ఏంటంటే ఆయిల్ కూలర్ ఉండటం. హీరో  ర్యాలీ కిట్  గురించి మాట్లాడుతూ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ‘ర్యాలీ కిట్’ త్వరలో హీరో డీలర్‌షిప్‌లలో కూడా లభిస్తుంది. హీరో ప్రస్తుతం మొత్తం కిట్‌ను అందిస్తోంది - ఇందులో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, మాక్సిస్ నాబీస్, హై ర్యాలీ సీట్, లాంగ్ సైడ్ స్టాండ్, హ్యాండిల్ బార్ రైజర్స్, ఎక్స్‌టెండెడ్ గేర్ షిఫ్టర్ పెడల్ ఉంటాయి.

దీనికి సస్పెన్షన్ యూనిట్లు తగినంత సామర్థ్యం కలిగి ఉండవు, కానీ ర్యాలీ కిట్ యూనిట్లు సస్పెన్షన్ 190 ఎం‌ఎం / 170 ఎం‌ఎం (ముందు / వెనుక) నుండి 250 ఎం‌ఎం / 220 ఎం‌ఎంకి పెంచుతాయి. అంతే కాదు ఫ్రంట్ ఫోర్క్ కంప్రెసర్, రీబౌండ్- అడ్జస్ట్ మెంట్ చేసుకోవచ్చు. ఫలితంగా గ్రౌండ్ క్లియరెన్స్ 220 ఎం‌ఎం నుండి 275 ఎం‌ఎం వరకు పెరుగుతుంది.

మీరు ఎక్స్‌పల్స్ 200 బిఎస్ 6, ర్యాలీ కిట్ రెండింటినీ కొనగలిగితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్ 6 బైక్ కంటే దాదాపు రూ .40,000 ఆదా చేసుకోగలుగుతారు, ఎందుకంటే దీని ధర రూ .1.89 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే హీరో బిఎస్ 6 ఎక్స్‌పల్స్ 200సి‌సి మంచి ఆఫ్-రోడర్‌గా ఈ బైక్ నిరూపించబడింది. 

click me!