వాష్‌బేసిన్, శానిటైజర్, వైఫైతో ఆనంద్ మహీంద్రను ఆశ్చర్యపరిచిన ముంబై ఆటొ..

By Sandra Ashok Kumar  |  First Published Jul 15, 2020, 3:55 PM IST

హ్యాండ్ వాషింగ్ సిస్టంతో ఉన్న ముంబైలోని ఒక ఆటో వీడియొను ప్రముఖ ఇండియన్ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త,  మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాని ఆకట్టుకుంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నేపధ్యంలో వ్యక్తిగత స్థాయిలో ప్రజలకు ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సొకకుండా స్వంత వినూత్న మార్గాల్లో వారి ఆలోచనలను, క్రియేటివిని కనబరుస్తున్నారు.


సాధారణంగా బయటికి వెళ్ళినపుడు బసులు దొరాకనపుడు  ఆటొలో వెళ్తుంటం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆటొలో అంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే కరోనా వైరస్ సృష్టిస్తున్న భీభత్సం అంతా ఇంతకాదు. అయితే తాజాగా ఆటొకి సంబంధించిన ఒక వీడియొ సోషల్ మీడియాలో యమ వైరల్ అయ్యి చెక్కర్లు కొడుతుంది.

హ్యాండ్ వాషింగ్ సిస్టంతో ఉన్న ముంబైలోని ఒక ఆటో వీడియొను ప్రముఖ ఇండియన్ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త,  మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాని ఆకట్టుకుంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నేపధ్యంలో వ్యక్తిగత స్థాయిలో ప్రజలకు ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సొకకుండా స్వంత వినూత్న మార్గాల్లో వారి ఆలోచనలను, క్రియేటివిని కనబరుస్తున్నారు.

Latest Videos

undefined

ఇటువంటి కీలకమైన సమయాల్లో ఆరోగ్య భద్రతను నిర్ధారించడానికి ఇలాంటి ఒక సృజనాత్మక మార్గం ఆనంద్ మహీంద్రా హృదయాన్ని గెలుచుకుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇందులో హ్యాండ్ వాషింగ్ బేసిన కూడా ఉంది.

ఒక నిమిషం కంటే ఎక్కువగా ఉన్న ఈ వీడియోలో సోప్ డిస్పెన్సర్‌తో కూడిన హ్యాండ్ వాషింగ్ బేసిన్ తో  కూడిన ప్రత్యేకమైన త్రీ-వీలర్‌ ఆటొ కనిపిస్తుంది. అంతేకాదు మీరు లిక్విడ్ హ్యాండ్ వాష్ సోప్ డిస్పెన్సర్, హ్యాండ్ శానిటైజర్ కూడా ఈ ఆటొలో చూడవచ్చు.  

also read ముంబై ట్రాఫిక్ కోసం ఈ వాహనం పర్ఫెక్ట్ : ఆనంద్ మహీంద్రా ...

త్రీ వీలర్‌ ఆటొలో స్వచ్చ్ భారత మిషన్ ‘తడి వ్యర్థాలు’, ‘పొడి వ్యర్థాలు’ కోసం  రెండు వేర్వేరు డబ్బాలు కూడా ఉన్నాయి.  వాహనం లోపల “ముంబై  మొట్టమొదటి హోమ్ సిస్టం ఆటో రిక్షా అద్భుతమైన సేవలను అందిస్తుంది” అని ఒక బోర్డు కూడా ఉంది. దాని క్రింద, వాహనంలో వై-ఫై సర్వీస్, డెస్క్‌టాప్, స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, మొబైల్ కనెక్ట్ చేసిన టీవీ, బ్లూటూత్ స్పీకర్లు, తాగడానికి శుద్ధి చేసిన నీరు, కూలింగ్ ఫ్యాన్ వంటి ఇంకా చాలా ఈ ఆటొలో ఉన్నాయి.

ఈ ఆటో-రిక్షాలో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక తగ్గింపు కూడా ఉంది. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు ఉచితంగా ఈ ఆటొలో ప్రయాణించవచ్చు. కోవిడ్ -19 హెల్ప్‌లైన్ నంబర్, వాహనం బయటి భాగంలో స్వచ్ఛ భారత్ నినాదం కూడా ఉన్నాయి.

పారిశ్రామికవేత్త పోస్ట్ చేసిన వీడియో క్లిప్ క్షణాల్లో ట్విట్టర్‌లో వైరల్ అయ్యింది. ఈ క్లిప్ ఇప్పటివరకు 32,000 లైక్‌లను, 5,000 కంటే ఎక్కువ రీట్వీట్‌లను సంపాదించింది. వైరల్ గా మారిన ఈ ఆటోరిక్షా ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. 

టేప్ రికార్డర్లు, కలర్ బల్బులతో అమర్చిన ఆటోలు ఒకప్పుడు విలాసవంతమైనవి. నేడు మారుతున్న ప్రపంచంలో కరోనా వ్యాప్తి సమయంలో లగ్జరీ, శానిటైజర్లు, వై-ఫైతో పాటు ఇంకా ఇంతర ఎన్నో ఆశ్చర్యకరమైనవి ఈ ఆటొలో ఉన్నాయి.

ఈ సౌకర్యాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న సత్యవన్ గీతే అనే ముంబైకి చెందిన వ్యక్తి ఆటో వీడియొను ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చేశారు. హోమ్ సిస్టంను వ్యవస్థాపించిన మొదటి ఆటో సత్యవన్ దే. వైరల్ గా మారిన ఈ ఆటో ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో సేన్సేషన్ సృష్టించింది. ఈ ఆటోలో చిన్న మొక్కలు కూడా ఉన్నాయి.
 

click me!