కరోనా రోగుల కోసం బైక్ అంబులెన్స్‌లు.. హర్యానా ప్రభుత్వానికి అందజేసిన హీరో మోటోకార్ప్..

By Sandra Ashok Kumar  |  First Published Aug 31, 2020, 7:03 PM IST

 ఈ వాహనాలు గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో ఉన్న రోగులను ఆసుపత్రికి  చేర్చడానికి, వారిని తరలించడానికి  చాలా ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. రోగులను సౌకర్యవంతంగా తరలించడానికి అవసరమైన అన్ని పరికరాలను ఈ బైకుకి అమర్చారు.


హీరో మోటోకార్ప్ ఇటీవల ప్రత్యేకంగా రూపొందించిన ఫస్ట్ రెస్పాండర్ వెహికల్స్ (ఎఫ్‌ఆర్‌వి) ను హర్యానా ప్రభుత్వానికి అందజేసింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఆర్ ఆధారంగా వచ్చిన వాహనాలను రేవారి, ధారుహెరాలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రులకు అప్పగించారు.

రవి కుమార్ పిసిపతి, ప్లాంట్ హెడ్, ధారుహేరా, హీరో మోటోకార్ప్ తో పాటు ధర్మ్ రక్షిత్, హెచ్ఆర్ హెడ్, ధారుహేరా, హీరో మోటోకార్ప్ నాలుగు ఫస్ట్ రెస్పాండర్ వాహనాలను రేవారి డిప్యూటీ కమిషనర్ యశేంద్ర సింగ్, రేవారి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుశీల్ కుమార్ మాహికి అందజేశారు.

Latest Videos

undefined

ఈ వాహనాలు గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో ఉన్న రోగులను ఆసుపత్రికి  చేర్చడానికి, వారిని తరలించడానికి  చాలా ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. రోగులను సౌకర్యవంతంగా తరలించడానికి అవసరమైన అన్ని పరికరాలను ఈ బైకుకి అమర్చారు.

also read 

బైకుకి ఫుల్ స్ట్రెచర్, ప్రథమ చికిత్స సామగ్రి, ఆక్సిజన్ సిలిండర్, మంటలను ఆర్పేది ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌విలకు ఎల్‌ఈడీ ఫ్లాషర్ లైట్స్, ఫోల్డబుల్ బెకన్ లైట్, ఎమర్జెన్సీ వైర్‌లెస్ పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, సైరన్ కూడా ఉంది.

కోవిడ్ -19 సహాయక చర్యల్లో భాగంగా హీరో మోటోకార్ప్ 14 లక్షల ఆహార పదార్ధాలు, 37,000 లీటర్ల శానిటైజర్లు, 30 లక్షల ఫేస్ మాస్క్‌లు, 15,000 పిపిఇ కిట్‌లను ప్రభుత్వ ఆసుపత్రులు, పోలీసు విభాగాలు, ఇతర ఏజెన్సీలకు పంపిణీ చేసింది.


కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడటానికి తమ వంతు సహకారం కొనసాగిస్తూ, ఫస్ట్ రెస్పాండర్ వహనాలను విస్తరించే ప్రయత్నాన్ని కంపెనీ ప్రారంభించిందని హీరో మోటోకార్ప్, ప్రధాన మానవ వనరుల అధికారి విజయ్ సేథి అన్నారు.

జైపూర్‌లోని హీరోస్ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (సిఐటి), గుర్గావ్‌లోని న్యూ మోడల్ సెంటర్ (ఎన్‌ఎంసి) లోని ఇంజనీర్లు రూపొందించి, అభివృద్ధి చేశారు. ఫస్ట్ రెస్పాండర్ వాహనాలు రోగులను ఆసుపత్రికి తరలించడానికి తక్షణ సహాయం అందించే అన్ని అవసరమైన వైద్య పరికరాలతో వస్తాయి. 
 

click me!