తొలి బీఎస్6 సర్టిఫికేషన్ పొందిన హీరో: త్వరలోనే స్ప్లెండర్‌ ఐస్మార్ట్‌

By narsimha lode  |  First Published Sep 6, 2019, 11:39 AM IST

బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన స్ప్లెండర్‌ ఐస్మార్ట్‌ 110 మోటార్‌సైకిల్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు హీరో మోటోకార్ప్‌ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం


న్యూఢిల్లీ: బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన స్ప్లెండర్‌ ఐస్మార్ట్‌ 110 మోటార్‌సైకిల్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు హీరో మోటోకార్ప్‌ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని బైకులను కంపెనీ డీలర్లకు పంపిందని, ఇవి ఒకటి రెండు రోజుల్లో వారికి అందుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

పరిశ్రమ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్ప్లెండర్‌ ఐస్మార్ట్‌ ధరకన్నా కొత్త స్ప్లెండర్‌ ధర 12-15 శాతం ఎక్కువగా ఉండవచ్చని అంటున్నారు. ఈ విషయమై హీరో మోటోకార్ప్‌ ఉన్నతాధికారి స్పందిస్తూ.. మార్కెట్లో వచ్చే ఊహాగానాలపై స్పందించలేమన్నారు. అయితే బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా నిర్దేశిత కాలంలో వాహనాలను తీసుకువచ్చే పనిలో ఉన్నామని చెప్పారు.

Latest Videos

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) నుంచి బీఎస్-6 సర్టిఫికేషన్ పొందిన తొలి టూ వీలర్ సంస్థ హీరో మోటో కార్ప్. దీన్ని బీఎస్- 6 ప్రమాణాలకు అనుగుణంగా రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్, సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీలో డిజైన్ చేశారు.

click me!