టీవీఎస్ సుజుకి యాక్సెస్ 125 అప్ డేటెడ్ వర్షన్ స్కూటర్ విపణిలో అడుగు పెట్టింది. దీని ధర రూ.61,788గా నిర్ణయించారు.
సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా (ఎస్‌ఎంఐపీఎల్) స్కూటర్ మోడల్ అప్ డేటెడ్ యాక్సెస్ 125 స్కూటర్‌ను విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.61,788 గా నిర్ణయించారు.
కొత్త వెర్షన్ స్కూటర్‌లో బ్లాక్ అల్లాయ్ చక్రాలు, లేత గోధుమ రంగు లెదర్ సీట్, క్రోమ్ మిర్రర్స్ తదితర ప్రత్యేక ఫీచర్లను జోడించామని కంపెనీ తెలిపింది. ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్లను ఛార్జింగ్‌కు వీలుగా డీసీ సాకెట్‌ను అమర్చారు.
undefined
‘భారత్‌లో సుజుకీ విజయానికి యాక్సెస్ 125 చాలా కీలక పాత్ర పోషించింది. దీంతో వినియోగదారులకు మరింత నచ్చేలా కొన్ని మార్పులు చేసి నవీకరించిన మోడల్‌ను తీసుకొచ్చాం’ అని ఎస్‌ఎంఐపీఎల్ వైస్ ప్రెసిడెంట్ దేవాశిష్ హండా పేర్కొన్నారు.
యాక్సెస్ 125 సుజుకి స్కూటర్‌లో డిస్క్ బ్రేక్ ఎక్విప్డ్ మెటీరియల్ ఉన్నాయి. స్టాండ్డర్డ్ స్కూటర్ తో పోలిస్తే దీని ధర రూ.1600 ఎక్కువ. 124 సీసీ, ఫోర్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన కొత్త యాక్సెస్ 125 మంచి మైలేజీ, పనితీరు అందిస్తుందని ఎస్‌ఎంఐపీఎల్ వైస్ ప్రెసిడెంట్ దేవాశిష్ హండా వెల్లడించారు.
సుజుకి యాక్సెస్ 125 మోడల్ స్కూటర్ న్యూ మెటాలిక్, మాటి బ్రాడెక్స్, మెటాలిక్ మాటె బ్లాక్, మెటాలిక్ సోనిక్ సిల్వర్ రంగుల్లో లబిస్తుంది. బ్లాక్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ మిర్రర్స్, డీసీ సాకెట్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. లాంగ్ సీట్, వైడ్ ఫుట్ బోర్డు, జెనిరియస్ స్టోరేజీ వసతులు కూడా ఉన్నాయి.
‘ఆటో’కు ద్రవ్య లభ్యత ఎపెక్ట్
నగదు కొరత, రుతుపవనాల్లో జాప్యంతో వాహనాల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) తెలిపింది. జూన్ నెలలో ప్యాసింజర్ వాహన (పీవీ) రిటైల్ విక్రయాలు 4.6 శాతం క్షీణించి 2,24,755 యూనిట్లుగా నమోదయ్యాయని తెలిపింది.
గత ఏడాది ఇదే నెలలో విక్రయాలు 2,35,539 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు ఏకంగా 17.54 శాతం క్షీణించాయని తెలిపింది.
ద్విచక్ర వాహనాల సేల్స్‌లోనూ క్షీణత
2018 జూన్‌లో పీవీ హోల్‌సేల్ విక్రయాలు 2,73,748 యూనిట్లుగా ఉండగా ఈ ఏడాది జూన్‌లో ఇవి 2,25,732 యూనిట్లకు పడిపోయాయు. మరోవైపు ద్విచక్ర వాహన విక్రయాలు కూడా 5 శాతం క్షీణించి 13,94,770 యూనిట్ల నుంచి 13,24,822 యూనిట్లకు పడిపోయినట్లు ఫాడా వెల్లడించింది.
వాణిజ్య వాహన విక్రయాలు కూడా 19.3 శాతం తగ్గి 48,752 యూనిట్లుగా నమోదైనట్లు పేర్కొంది. మొత్తంగా జూన్ నెలలో అన్ని విభాగాల వాహన విక్రయాలు 5.4 శాతం క్షీణించి 16,46,776 యూనిట్లుగా నమోదయ్యాయని ఫాడా తెలిపింది.