ఒకినావా ఆర్30 ఎలక్ట్రిక్ స్కూటర్.. మైలేజ్ ఎంతో తెలుసా..

By Sandra Ashok Kumar  |  First Published Sep 1, 2020, 6:36 PM IST

తాజాగా ఒకినావా కంపెనీ స్లో స్పీడ్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. విశేషం ఏమిటంటే పిల్లలకు కూడా ఎలక్ట్రిక్ వాహన అనుభవాన్ని అందిస్తుంది. స్లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్ని వయసుల వారు చిన్న ప్రయాణాల కోసం సురక్షితంగ ప్రయానించడానికి సహకరిస్తుంది.


హైదరాబాద్, సెప్టెంబర్ 1, 2020: ఎలక్ట్రిక్ వాహనాలు ప్రస్తుతం భారతీయ ప్రజలకు కొత్త కాన్సెప్ట్. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు మార్కెట్లో పోటీని నెలకొల్పేందుకు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరిస్తున్నాయి. తక్కువ మైంటైనాన్స్ ఖర్చులతో అధిక  మన్నికగాల బ్యాటరీతో వాహనదారులను ఆకర్షిస్తున్నాయి. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు వాతావరణనికి ఎంతో మేలు చేకూర్చనుంది. 

తాజాగా ఒకినావా కంపెనీ స్లో స్పీడ్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. విశేషం ఏమిటంటే పిల్లలకు కూడా ఎలక్ట్రిక్ వాహన అనుభవాన్ని అందిస్తుంది. స్లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్ని వయసుల వారు చిన్న ప్రయాణాల కోసం సురక్షితంగ ప్రయానించడానికి సహకరిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. పిల్లలు, మహిళలు కూడా షాపింగ్, ట్యూషన్లు, స్కూల్స్ మొదలైన  రోజు ఉండే పనుల కోసం సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. అందరికీ ఈ అనుభవాన్ని అందించే విధంగా ఓకినావా ఆర్30 స్లో స్పీడ్ స్కూటర్ రూపొందించారు.

Latest Videos

undefined

ఓకినావా స్కూటర్  పవర్ 
 ఓకినావా ఆర్30 250 వాట్ల బి‌ఎల్‌డి‌సి వాటర్ ప్రూఫ్ మోటారు దీనికి అమర్చారు, ఇది 250 వాట్ల గరిష్ట శక్తిని అందిస్తుంది. వాహనదారులు రోజు ఉండే వారీ అవసరాలను తీర్చడానికి ఒకే ఛార్జీపై 60 కిలోమీటర్ల వరకు సౌకర్యవంతమైన మైలేజ్ ఈ-స్కూటర్‌ ఇస్తుంది.

also read  

బ్యాటరీ
ఈ-స్కూటర్ లో 1.25 కిలోవాట్ల రిమువబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది, 5amp ద్వారా ఇంట్లో ఉండే సాకెట్ల ద్వారా కూడా బ్యాటరీని ఛార్జ్ చేయడాన్ని ప్రజలకు సహయడుతుంది. ఒకవేళ పార్కింగ్‌ ప్రదేశంలో ఛార్జింగ్ పాయింట్లు లేని వారికి ఇంట్లో బ్యాటరీలను ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం 4-5 గంటలు పడుతుంది. స్కూటర్ ఆటో కట్‌తో మైక్రో ఛార్జర్‌తో వస్తుంది.

డిజైన్
ఈ-స్కూటర్ పెర్ల్ వైట్, సీ గ్రీన్, సన్‌రైజ్ ఎల్లో, గ్లోసీ రెడ్, మెటాలిక్ ఆరెంజ్ వంటి 5 రంగులలో లభిస్తుంది. ఆర్30 స్కూటర్ చాలా బ్యాలెన్సేడ్ డిజైన్ తో వస్తుంది దీనిని  ప్రతి ఒక్కరూ సౌకర్యవంతగా నడపవచ్చు. దీనికి స్టైలిష్ ఫ్రంట్ హెడ్ లైట్లు, వెనుక లైట్లు ఉన్నాయి. స్టైలిష్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

ధర
ఈ-స్కూటర్ రూ.58,992 ఎక్స్-షోరూమ్ ధరకు లభిస్తుంది. బ్యాటరీ ఇంకా మోటారు రెండింటిపై 3 సంవత్సరాల వారంటీతో అందిస్తుంది.

మరింత సమాచారం కోసం సంప్రదించండి:
రాజేష్ - 7702220228

click me!