ఎలక్ట్రిక్‌ స్టార్టప్‌లో టాలీవుడ్ హీరో పెట్టుబడులు.. జనవరి 2021 నుండి కార్యకలాపాలు ప్రారంభం..

By Sandra Ashok Kumar  |  First Published Nov 2, 2020, 10:44 AM IST

తెలంగాణ ప్రభుత్వ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా విజయ్ దేవరకొండ పెట్టుబడులను ప్రకటించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే  ఈ పెట్టుబడి మొత్తం ఎంత అనేది వెల్లడించలేదు.
 


టాలీవుడ్ హీరో, పారిశ్రామికవేత్త విజయ్ దేవరకొండ హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ వాట్స్ అండ్ వోల్ట్స్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు, వచ్చే ఏడాది నుంచి వాట్స్ అండ్ వోల్ట్స్‌ కార్యకలాపాలు ప్రారంభించబోతోంది.

తెలంగాణ ప్రభుత్వ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా విజయ్ దేవరకొండ పెట్టుబడులను ప్రకటించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే  ఈ పెట్టుబడి మొత్తం ఎంత అనేది వెల్లడించలేదు.

Latest Videos

undefined

స్వల్ప ప్రయాణానికి వీలుగా కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్‌ సైకిల్స్, బైక్‌లు, స్కూటర్ల వంటివి తీసుకొస్తామని విజయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  ఇప్పటికే విజయ్‌ ‘రౌడీ’ బ్రాండ్‌ పేరిట దుస్తుల విభాగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

also read 

‘స్థిరమైన, పర్యావరణహిత అనుకూలమైన ప్రత్యామ్నాయాలు మనకు మంచి భవిష్యత్తును అందివ్వగలవని నేను గట్టిగా నమ్ముతున్నాను. వాట్స్‌ అండ్‌ వోల్ట్స్‌ ద్వారా చేతులు కలపడం ద్వారా చిన్న ప్రయాణాలకోసం ఎలక్ట్రిక్‌ సైకిల్స్‌, బైక్స్‌, స్కూటీలను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాం.

ఇవి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిస్తాయని, చిన్న ప్రయాణల కోసం విద్యుత్‌ ఆధారిత వాహనాలనే వాడండి’ అని విజయ్‌ దేవరకొండ  పేర్కొన్నారు.

అక్టోబర్ 30న హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాల సమ్మిట్‌లో కంపెనీ ఆపరేషన్ ప్లాన్, విజన్ స్టేట్‌మెంట్ ప్రారంభించింది,  పే-పర్-యూజ్ మోడల్ కింద ప్రయాణికులు ప్రయాణించిన దూరానికి మాత్రమే చెల్లించవచ్చని చెప్పారు.

వాట్స్ మరియు వోల్ట్స్ జనవరి 2021 నుండి కార్యకలాపాలను ప్రారంభిస్తాయి.తెలంగాణ ఐటి మంత్రి కె టి రామారావు ప్రారంభించిన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ 2020 నుండి 2030 వరకు అమలులోకి వస్తుంది.
 

click me!