పాపులర్ యాక్షన్ మూవీస్ లో హీరో పాత్రలో అలరిస్తున్న టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన మూవీస్ లో ఎక్కువగా యాక్షన్ సీన్స్ , స్టంట్స్ ప్రక్షకులను మరింతగా ఆకట్టుకుంటాయి. తాజాగా టామ్ క్రూజ్ చేసిన బైక్ స్టంట్ చూస్తే వావ్ అనల్సిందే.
హాలీవుడ్ సూపర్ స్టార్ హీరో టామ్ క్రూజ్ మళ్ళీ వైరల్ అయ్యాడు. ఎంటో అనుకుంటున్నారా.. పాపులర్ యాక్షన్ మూవీస్ లో హీరో పాత్రలో అలరిస్తున్న టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తన మూవీస్ లో ఎక్కువగా యాక్షన్ సీన్స్ , స్టంట్స్ ప్రక్షకులను మరింతగా ఆకట్టుకుంటాయి. తాజాగా టామ్ క్రూజ్ చేసిన బైక్ స్టంట్ చూస్తే వావ్ అనల్సిందే. మిషన్ ఇంపాజిబుల్ కొత్త చిత్రం కోసం నార్వేలో ఈసారి అద్భుతమైన బైక్ స్టంట్ షూటింగ్ జరిగింది.
undefined
గత నెలలో క్రూజ్ యూ.కేలో కనిపించాడు. ఒక ర్యాంప్ పై నుండి హోండా సిఆర్‌ఎఫ్ 450 బైక్ నుండి దూకే సన్నివేశం షూటింగ్ జరిగింది. ఈ సీన్ డ్రోన్ కెమెరాల ద్వారా షూట్ చేశారు. అయితే నార్వేలోని తాజా స్టంట్ షాట్ యూ.కే లోని స్టంట్ షాట్ ఒకే సీన్ అనుసరిస్తున్నట్లుగా ఉంది.
నార్వేజియన్ ఫ్జోర్డ్స్ ఆఫ్ హర్టిగ్రుటెన్‌లోని కొన్ని అద్భుతమైన దృశ్యాల షూటింగ్ నేపథ్యంలో ఒక పెద్ద కొండ చివరి పై ప్రదేశం నుండి టామ్ క్రూజ్ ఒక ర్యాంప్ పై బైక్ తో స్పీడ్ గా వెళ్తూ దూకే సన్నివేశాన్ని చిత్రీకరించారు.
also read
ఈ సీన్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే అందుకంటే అంతా ఎత్తునుంచి బైక్ పై స్టంట్ చేయడం సాహసం అనే చెప్పాలి. బైక్ పై స్టంట్ చేస్తూ గాలిలో బైక్ వదిలేస్తూ తాను పారాచూట్ ద్వారా కిందకి చేరుకున్నాడు.
ఈ సీన్ లో ఉండే బైక్ స్పష్టంగా కనిపించకపోయిన ఇది హోండా సిఆర్ఎఫ్ 450 కావచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే యూకేలో జరిగిన ఒక షూట్ సమయంలో కూడా టామ్ క్రూజ్ అదే బైక్ పై కనిపించాడు.
అయితే కేవలం ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయడానికి ఎంత మంది ఉపయోగపడతారో ఇది చూస్తే తెలుస్తుంది. తాజా స్టంట్ వీడియోలో డ్రోన్ కెమెరాలు, ఒక హెలికాప్టర్ ద్వారా కూడా ఫుటేజీని చిత్రీకరిస్తున్నట్లు కనిపిస్తాయి. గొప్ప విషయం ఏంటంటే మరోసారి టామ్ క్రూజ్ ఈ బైక్ స్టంట్ ను ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా చేశాడు కావచ్చు!
మిషన్ ఇంపాజిబుల్ ఫిల్మ్ షూటింగ్ తాజా ప్రదేశాలలో అనేక గూడాచారి షాట్లు, బైక్ రైడింగ్ స్టంట్ చిత్రీకరించారు. దీని బట్టి మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో అనేక బైక్ యాక్షన్ సన్నివేశాలు, స్టంట్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
వీడియో చూడడానికి https://www.youtube.com/watch?time_continue=40&v=wzhKUHJZI7w&feature=emb_logo క్లిక్ చేయండి