కొత్త కలర్ ఆప్షన్స్ లో బిఎస్ 6 కెటిఎం బైక్స్.. ధర ఎంతంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Sep 29, 2020, 10:51 AM IST

కొత్త  బిఎస్ 6 కే‌టి‌ఎం బైక్స్ అదనంగా కొత్త కలర్ ఆప్షన్లలో వస్తున్నాయి.  కే‌టి‌ఎం ఆర్‌సి 390 ఫ్లాగ్‌షిప్ బైక్‌ ఇప్పుడు మెటాలిక్ సిల్వర్ కలర్ లో లభిస్తుంది, దీని ధర రూ.2.53 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ). కే‌టి‌ఎం ఆర్‌సి 125, ఆర్‌సి 200 రెండు బైక్స్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్, డార్క్ గాల్వానో కలర్స్ లో రానున్నాయి.


లగ్జరీ స్పొర్ట్స్ కార్, బైక్స్ తయారీ సంస్థ కే‌టి‌ఎం ఇండియాలో బిఎస్ 6 కంప్లైంట్ సూపర్ స్పోర్ట్ రేంజ్ ఆర్‌సి 125, ఆర్‌సి 200, ఆర్‌సి 390 బైక్స్  ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది. కొత్త  బిఎస్ 6 కే‌టి‌ఎం బైక్స్ అదనంగా కొత్త కలర్ ఆప్షన్లలో వస్తున్నాయి.  

కే‌టి‌ఎం ఆర్‌సి 390 ఫ్లాగ్‌షిప్ బైక్‌ ఇప్పుడు మెటాలిక్ సిల్వర్ కలర్ లో లభిస్తుంది, దీని ధర రూ.2.53 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ). కే‌టి‌ఎం ఆర్‌సి 125, ఆర్‌సి 200 రెండు బైక్స్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్, డార్క్ గాల్వానో కలర్స్ లో రానున్నాయి.

Latest Videos

undefined

కొత్త కలర్ కెటిఎం ఆర్‌సి 125 బైక్ ధర రూ.1.59 లక్షలు కాగా, ఆర్‌సి 200 ధర రూ.2 లక్షలు ( ధరలు ఎక్స్-షోరూమ్, ఢీల్లీ). ఈ కొత్త కలర్ ఆప్షన్స్ బైక్ లవర్స్ కి సరిపోయే కలర్ ఎంఛుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.

also read టాటా మోటార్స్ కార్లపై ఫెస్టివల్ ఆఫర్.. డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా.. ...

బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ మాట్లాడుతూ, "కెటిఎం ఆర్‌సి బైక్స్  మోటోజిపి రేసర్- కెటిఎం ఆర్‌సి 16 నుండి ప్రేరణ పొందాయి. అలాగే, భారతదేశంలోని సూపర్‌స్పోర్ట్ బైక్స్ ఔత్సాహికులు కొత్త కలర్ ఆప్షన్స్ ఇష్టపడతారు.

ప్రతి కే‌టి‌ఎం ఆర్‌సిలోని ఈ అదనపు కలర్ ఆప్షన్స్ దాని ఆకర్షణను మరింత పెంచుతాయి. " అని అన్నారు.  కే‌టి‌ఎం ఆర్‌సి 125 బైక్ ఫుల్ -ఫైర్డ్ బైక్, ఇది 125 సిసి లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 14 బిహెచ్‌పి, 12 ఎన్‌ఎమ్ పవర్ అందిస్తుంది.

ఆర్‌సి 200 బైక్ 199.5 సిసి లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌, 25 బిహెచ్‌పిని 19 ఎన్ఎమ్ పీక్ టార్క్ తో ఉత్పత్తి చేస్తుంది. ఆర్‌సి 390 బైక్  390 సిసి ఇంజన్, 43 బిహెచ్‌పి, 37 ఎన్‌ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. అన్ని ఆర్‌సి మోడళ్లలో 43 ఎంఎం అప్‌సైడ్-డౌన్ ఫోర్క్స్ అప్ ఫ్రంట్, వెనుక భాగంలో అడ్జస్ట్  చేయగల మోనో-షాక్ సెటప్ ఉన్నాయి. 
 

click me!