థాయ్ లాండ్ ఓపెన్: సైనా నెహ్వాల్ చిత్తు, శ్రీకాంత్ వాకోవర్

By telugu teamFirst Published Jan 14, 2021, 7:43 PM IST
Highlights

థాయ్ లాండ్ ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల కథ ముగిసింది. సైనా నెహ్వాల్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలు కాగా, కిడాంబ్ శ్రీకాంత్ వాకోవర్ ఇచ్చేశాడు.

బ్యాంకాక్: థాయ్ లాండ్ ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఖైల్ ఖతమైంది. కొందరు తొలి, రెండో రౌండ్లలో ఓటమి పాలు కాగా, మరి కొంత మంది ఫిట్నెస్ చిక్కుల్లో మధ్యలోనే తప్పుకున్నారు. యోనెక్స్ థాయ్ లాండ్ ఓపెన్ సూపర్ 1000 మహిళల రెండో రౌండ్లో సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. 

స్థానిక షట్లర్, ప్రపంచ 12వ ర్యాంకర్ బుసానన్ చేతిలో 23-21, 14-21, 16-21 స్కోరు తేడాతో సైనా ఓటమి పాలైంది. దాదాపు 68 నిమిషాల పాటు ఇరువురి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చాలా కాలం తర్వాత కోర్టులోకి దిగిన సైనా నెహ్వాల్ ప్రత్యర్థిపై శక్తి మేరకు పోరాడింది.

ఇదిలావుంటే, పురుషుల రెండో రౌండ్ కు చేరుకున్న మాజీ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ వాకోవర్ ప్రకటించాడు. మలేసియా క్రీడాకారుడు లీ జి జియాతో అతను పోటీ పడాల్సి ఉంది. కుడికాలు పిక్క కండరాలు పట్టేయడంతో శ్రీకాంత్ ఆట నుంచి తప్పుకున్నాడు.

అంతకు ముందు పురుషుల సింగిల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 19-21, 171-21 తేడాతో ఇండినేషియా జోడీ మహమ్మద్ ఉహ్ సన్, హెండ్రా సెతియవన్ చేతిలో ఓటమి పాలైంది.

click me!