బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చేసిన ఓ పోస్టు... అందర్నీ అయోమయానికి గురి చేసింది. కొందరు సంచలన వార్తగా భావించి బ్రేకింగ్ ఇవ్వాలనే తొందరలో అసలు విషయాన్ని అర్థం చేసుకోవడంలో అయోమయానికి గురయ్యారు కొందరు అభిమానులు, మీడియా ప్రతినిధులు.
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చేసిన ఓ పోస్టు... అందర్నీ అయోమయానికి గురి చేసింది. కొందరు సంచలన వార్తగా భావించి బ్రేకింగ్ ఇవ్వాలనే తొందరలో అసలు విషయాన్ని అర్థం చేసుకోవడంలో అయోమయానికి గురయ్యారు కొందరు అభిమానులు, మీడియా ప్రతినిధులు. ‘డెన్మార్క్ ఓపెన్ చివరిది... నేను రిటైర్ అవుతున్నా’ అనే పోస్టును హైలైట్ చేసింది పీవీ సింధు. అయితే అసలు విషయం ఆ తర్వాతే ఉంది.
undefined
‘ఈ విపత్తు నా కళ్లు తెరిపించింది. కఠినమైన ప్రత్యర్థులను ఓడించేందుకు నేను శిక్షణ పొందాను. నేను ఇంతకుముందు కూడా ఇలా చేశాను. మళ్లీ చేయగలను. అయితే ప్రపంచంలో కనిపించని వైరస్‌ను ఎలా ఓడించగలను. కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాను. ఇప్పటికే మనం బయట అడుగువేసిన ప్రతీసారి ఏవేవో ప్రశ్నలు వేసుకోవాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో మనసుని కదిలించే ఎన్నో కథలను చదివాను. ఇవన్నీ చదివాక నన్ను నేను ప్రశ్నించుకునేలా చేసింది. డెన్మార్క్ ఓపెన్‌లో భారతదేశానికి ప్రతినిథ్యం వహించలేకపోవడం ఇదే ఆఖరిసారి.
నేను మీకు మినీ-హార్ట్ ఎటాక్ ఇచ్చి ఉండవచ్చు. కానీ ఇలాంటి సమయాల్లో ఇలాంటివి కావాలి. మీరు నోటిస్ చేసే విషయాలు కావాలి... అవును. డెన్మార్క్ ఓపెన్ ఈసారి కావడం లేదు, అయితే అది నన్ను ట్రెయిన్ కాకుండా ఆపలేదు. ఆసియా ఓపెన్ అవుతుందనుకుంటున్నా....’ అంటూ సుదీర్ఘ పోస్టు చేసింది పీవీ సింధు.