షటిల్‌కాక్ తీరులో ఉన్న సినిమా టైటిల్‌ను డిజైన్ చేశారు. దాన్ని ఓ చేత్తో గాల్లోకి విసురుతున్నట్టు పోస్ట్‌ర్‌లో కనబడుతోందనేది నెటిజన్ల ప్రధాన అభ్యంతరం.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాకి సైనా అనే పేరు కూడా ఖరారు చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పోస్టర్ ఇటీవలే విడుదలైంది. అయితే..ఈ పోస్ట్‌ర్లో తప్పుందంటూ నెటిజన్లు ప్రస్తుతం గ్గోగులు పెడుతున్నారు.
ఇదేంటీ.. ఇలా చేసేశారు అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిచ్చేస్తున్నారు. వీరి అభ్యంతరానికి కారణం.. సినిమా పోస్టర్ డిజైనే. షటిల్‌కాక్ తీరులో ఉన్న సినిమా టైటిల్‌ను డిజైన్ చేశారు. దాన్ని ఓ చేత్తో గాల్లోకి విసురుతున్నట్టు పోస్ట్‌ర్‌లో కనబడుతోందనేది నెటిజన్ల ప్రధాన అభ్యంతరం. బ్యాడ్మింటన్‌లో సర్వ్ చేసే విధానం ఇది కాదని అనేక మంది కామెంట్లు పెడుతున్నారు.
undefined
ఇక కొందరు తమదైన శైలిలో చమత్కారపూరిత విమర్శలకు దిగారు. ‘బ్యాడ్మింటన్ సర్వ్ కింద నుంచి చేస్తారు. టెన్నిస్‌లో బంతిని గాల్లోకి ఎగరేసి సర్వ్ చేస్తారు. ఎవరో టెన్నిస్ ఫ్యాన్ దీన్ని రూపొందించి ఉంటారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
దీనికి ఏకంగా 5 వేల లైకులు వచ్చి పడ్డాయి. మరో వ్యక్తి మాత్రం మరింత ఫన్ జోడిస్తూ..‘సైనా సినిమా పోస్టర్‌ను సానియా మిర్జా అభిమానితో చేయించినట్టున్నారు’ అంటూ ఛలోక్తికి విసిరారు. ఈ చిత్రం మార్చి 26న దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది.