ఇంట్లో గొడవలు, అందుకే సెడన్‌గా లండన్‌కు చెక్కేసిందా... పీవీ సింధు స్పందన ఇదీ...

Published : Oct 20, 2020, 03:43 PM ISTUpdated : Oct 20, 2020, 03:47 PM IST
ఇంట్లో గొడవలు, అందుకే సెడన్‌గా లండన్‌కు  చెక్కేసిందా... పీవీ సింధు స్పందన ఇదీ...

సారాంశం

హాలీ డే టైమ్‌లో లండన్‌లో వాలిపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్... సడెన్‌గా లండన్‌కి వెళ్లడంతో ఇంట్లో వాళ్లతో పడకనే లండన్ చెక్కేసిందంటూ వార్తలు... సోషల్ మీడియా వేదికగా స్పందించిన పీవీ సింధు...

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, కొన్నాళ్లుగా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన పీవీ సింధు, ఆకస్మాత్తుగా లండన్‌లో వాలిపోయింది. కరోనా టైమ్ కారణంగా టోర్నమెంట్లు ఏమీ లేవు... ఈ సమయంలో ఎందుకు ఇంత అర్జెంటుగా లండన్ వెళ్లిందో తెలియక తెగ ఆశ్చర్యపోయారు.

బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు ఇంట్లో గొడవల కారణంగా లండన్ వెళ్లిందని వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ పుకార్లపై స్పందించింది పీవీ సింధు.

 

‘నేను కొన్నిరోజుల క్రితమే లండన్‌కి వచ్చాను. న్యూట్రిషన్ GSSI  రికవరీ కోసం ఇక్కడి వచ్చాను. మా ఇంట్లోవాళ్ల సలహాతోనే లండన్ వచ్చా. అంతేకానీ వాళ్లతో ఎలాంటి గొడవలూ లేవు. నా కోసం వాళ్ల జీవితాలనే త్యాగం చేసిన మా అమ్మానాన్నలతో నాకెందుకు గొడవలు ఉంటాయి’ అని వివరంగా రాసుకొచ్చింది పీవీ సింధు. తన కోచ్ పుల్లెల గోపిచంద్‌తో కూడా తనకి ఎలాంటి గొడవలు లేవని చెప్పింది పీవీ సింధు.

PREV
click me!

Recommended Stories

అమ్మతనానికి ఆదర్శం.. 30 లీటర్ల చనుబాలు దానం చేసిన గుత్తా జ్వాల
Saina Kashyap: కశ్యప్ తో విడాకులు.. ట్విస్ట్‌ ఇచ్చిన సైనా నెహ్వాల్‌