లాక్ డౌన్ తో బాయ్ ఫ్రెండ్ దూరం.. గుత్తాజ్వాలా విరహ వేదన

By telugu news team  |  First Published Mar 30, 2020, 12:30 PM IST

కాగా బ్యాడ్మింటన్‌ ఫైర్‌ బ్రాండ్‌  గుత్తా జ్వాల, త‌మిళ న‌టుడు విష్ణు విశాల్‌ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవ్వ‌గా అందులో  విష్ణు.. గుత్తా జ్వాల‌కు ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఇందులో ఉండ‌టం విశేషం. 


ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల తన బాయ్ ఫ్రెండ్ ని బాగా మిస్సౌతోందట. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. దానిని అరికట్టేందుకు భారత్ లో లాక్ డౌన్ ప్రకటించారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ క్రమంలో.. ఎవరికి వారు ఇంట్లో పరిమితమయ్యారు. దీంతో.. బాయ్ ఫ్రెండ్ కి దూరమయ్యానని గుత్తాజ్వాల బాధపడిపోతోంది.

Also Read నటుడు విష్ణు విశాల్ తో డేటింగ్ నిజమే: అంగీకరించిన జ్వాలా గుత్తా...

Latest Videos

undefined

ఈ విష‌యాన్ని జ్వాలానే స్వ‌యంగా ట్విట‌ర్ ద్వారా తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా గుత్తా జ్వాలా హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు. తన ప్రియుడు విష్ణు విశాల్‌ను మిస్ అవుతున్న‌ట్లు తెలిపారు. ఈ మేరకు మిస్ యూ..అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై స్పందించిన‌ విష్ణు ప‌ర్లేదు.. ప్ర‌స్తుతం సామాజిక దూరం ముఖ్యం.. అంటూ జ్వాలాను కూల్ చేశారు.

 

Its oki..Right now social distancing is important..🙏pray for all...🤗 https://t.co/al7iPw261N

— VISHNU VISHAL - VV (@TheVishnuVishal)

కాగా బ్యాడ్మింటన్‌ ఫైర్‌ బ్రాండ్‌  గుత్తా జ్వాల, త‌మిళ న‌టుడు విష్ణు విశాల్‌ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవ్వ‌గా అందులో  విష్ణు.. గుత్తా జ్వాల‌కు ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఇందులో ఉండ‌టం విశేషం. 

దీంతో వీరిద్ద‌రూ ప్రేమాయ‌ణం న‌డుపుత‌న్న‌ట్లు క్లారిటీ ఏర్ప‌డింది. ఇక‌ హీరో విష్ణు విశాల్ గతేడాది జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌తో విభేదాల కారణంగా విడిపోయారు.

click me!