జనాభా పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం ఇండియా అయినప్పటికీ, ఇక్కడ కేవలం 7.5% శాతం మందికి మాత్రమే కారు ఉన్నాయి అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ సమాచారాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్న కార్ల సంఖ్య కాలుష్యానికి పెద్ద సమస్యగా మారుతోంది. మీరు కూడా జనాభా పరంగా చూస్తే ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం భారతదేశంలో కార్ల సంఖ్య చాలా తక్కువ. అయితే ఇండియాలో ఎన్ని ఇళ్లలో కార్లు ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లోని ప్రజల ఇళ్లలో ఎక్కువ సంఖ్యలో కార్లు ఉన్నాయో తెలుసుకొండి...
ఇండియాలో ఎన్ని ఇళ్లలో కార్లు ఉన్నాయంటే..?
undefined
జనాభా పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం ఇండియా అయినప్పటికీ, ఇక్కడ కేవలం 7.5% శాతం మందికి మాత్రమే కారు ఉన్నాయి అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ సమాచారాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో తెలిపారు.
ఆనంద్ మహీంద్రా ఆసక్తికర సమాచారం
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైన సమాచారాన్ని షేర్ చేశారు. ఇందులో ఏ రాష్ట్రంలో ఎన్ని ఇళ్లకు కార్లు ఉన్నాయని దేశ మ్యాప్‌లో పేర్కొన్నారు. ఈ డేటా ప్రస్తుత డాటా కానప్పటికీ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019 నుండి 2021 మధ్య జరిగింది. ఇందులో ఈ సమాచారం తెరపైకి వచ్చింది.
ఏ రాష్ట్రంలో అత్యధిక కార్లు
ఒక నివేదిక ప్రకారం, ఇండియాలోని చాలా చిన్న రాష్ట్రాల వారి ఇళ్లలో కార్లు ఉన్నాయి. చాలా చిన్న రాష్ట్రాలలో ఒకటైన గోవాలో ఇండియాలోనే అత్యధిక సంఖ్యలో కార్లు ఉన్నాయి. బీచ్‌లు, చర్చిలు ఇంకా నైట్ లైఫ్‌కి ప్రసిద్ధి చెందిన గోవాలో 45.2% శాతం కుటుంబాలకు కార్లు ఉన్నాయి.
అతి తక్కువ సంఖ్యలో కార్లు ఉన్న రాష్ట్రం ?
గోవాలో అత్యధిక కార్లు ఉండగా, బీహార్‌లో తక్కువ సంఖ్యలో కార్లు ఉన్నాయి. బీహార్‌లో కేవలం 2% కుటుంబాలకు మాత్రమే కార్లు ఉన్నాయి. బీహార్ తర్వాత ఒడిశా 2.7 శాతం, ఆంధ్రప్రదేశ్ అండ్ పశ్చిమ బెంగాల్ 2.8 శాతం, జార్ఖండ్ 4.1%, ఛత్తీస్‌గఢ్ 4.3 శాతం కుటుంబాలకు మాత్రమే కార్లు ఉన్నాయి.
ఉత్తర భారత్ పరిస్థితి ఏంటి
ఉత్తర భారతీయులకు కూడా కార్లంటే చాలా ఇష్టం. జమ్మూ కాశ్మీర్‌లో 23.7 శాతం, హిమాచల్‌ప్రదేశ్‌లో 22.1%, పంజాబ్‌లో 21.9%, హర్యానాలో 15.3%, ఉత్తరాఖండ్‌లో 12.7%, ఉత్తరప్రదేశ్‌లో 5.5%, ఢిల్లీలో 19.4%, రాజస్థాన్‌లో 8.2 శాతం ఇళ్లలో కార్లు ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల్లో
సిక్కింలో 20.9 శాతం కుటుంబాలలో కార్లు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ 19.3%, నాగాలాండ్ 21.3%, మణిపూర్ 17%, మిజోరం 15.5%, త్రిపుర 4.6%, మేఘాలయ 12.9%, అస్సాం 8.1%, గుజరాత్ 10.9%, మధ్యప్రదేశ్ 5.3%, మహారాష్ట్ర 8.7%, తెలంగాణ 6.5%, కర్ణాటక 9.1%, కేరళలో 24.2%, తమిళనాడులో 6.5% కుటుంబాల ఇళ్లలో కార్లు ఉన్నాయి.