63 వ వార్షికోత్సవం అడుగుపెట్టిన యమహా కంపనీ

First Published 3, Jul 2018, 12:24 PM IST
Highlights

చెన్నై ప్రధాన కార్యాలయంలో పండగ వాతావరణం...

యమహా మోటర్ ఇండియా 63 వసంతంలోకి అడుగుపెట్టింది. జపాన్ కు చెందిన మాతృ సంస్థ యమహా మోటార్ కంపనీ లిమిటెడ్ ఏర్పడి ఇప్పటికి 62 సంవత్సరాలు ముగిసి 63 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1955 లో యమహా సంస్థను తమిళనాడులో ఏర్పాటు చేశారు. 

దేశవ్యాప్తంగా ఉన్న యమహా కంపనీకి చెందిన సంస్థల్లో జూలై 1 మరియు జూలై 2 తేదీల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ''యమహా డే'' పేరుతో జరిగిన వేడుకల్లో బాగంగా తమ బ్రాండ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణను పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవాలని తమ ఉద్యోగులకు యమహా సంస్థ సూచించింది. 

ఈ సందర్భంగా ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచే పలు కార్యక్రమాలను  నిర్వహించారు. అంతేకాకుండా ఇప్పటివరకు కంపనీ సాధించిన విజయాలను తెలియజేస్తూ, భవిష్యత్ లో వినియోదారును ఆకట్టుకునేలా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఉద్యోగులకు ఈ సంస్థ సూచించింది.

ఇక చెన్నై మహాబలిపురం రోడ్ లోని ఎకెడిఆర్ టవర్స్ లో గల  యమహా మోటార్స్ ఇండియా ప్రధాన కార్యాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాన్ ఇండియా యమహా డీలర్ షిప్స్ ఉద్యోగులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ''వన్ యమహా'' అనే కంపనీ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని చెన్నై,సూరజ్ పూర్, ఫరిదాబాద్ లోని యమహా కంపనీ ఉద్యోగులు తెలిపారు.


 

Last Updated 3, Jul 2018, 12:24 PM IST