సూపర్ కార్లను కూడా బీట్ చేసే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్.. 2 సెకండ్లలో టాప్ స్పీడ్..

By asianet news telugu  |  First Published Nov 21, 2022, 5:36 PM IST

రిమాక్ నవారా ప్రపంచంలోనే అత్యుత్తమ అండ్ వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు. మీడియా నివేదికల ప్రకారం, కారును తయారు చేసిన కంపెనీ ఈ కార్  టాప్ స్పీడ్ గంటకు 412 కిలోమీటర్లు అని పేర్కొంది. 


ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లు స్పీడ్ అండ్ లుక్ పరంగా సూపర్ కార్ల కంటే తక్కువేం కాదు, ఎందుకంటే మనం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బెస్ట్ ఎలక్ట్రిక్ సూపర్‌కార్లను ఇప్పటివరకు చూశాం. ఈ కార్లు కేవలం సెకండ్లలో సున్నా నుండి గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటాయి. ఇప్పుడు అలాంటి సూపర్ కార్ గురించి మీకోసం...

స్పీడ్ అండ్ లూక్ 
రిమాక్ నవారా ప్రపంచంలోనే అత్యుత్తమ అండ్ వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు. మీడియా నివేదికల ప్రకారం, కారును తయారు చేసిన కంపెనీ ఈ కార్  టాప్ స్పీడ్ గంటకు 412 కిలోమీటర్లు అని పేర్కొంది. ఈ కార్ ఎలక్ట్రిక్‌ కార్ అయినప్పటికి కూడా కారును అత్యంత స్పీడ్ తో నడపవచ్చు. దీనితో పాటు ఈ కారు కేవలం 1.95 సెకన్లలో సున్నా నుండి గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. ఇంత తక్కువ సెకండ్లలో చాలా మంచి శక్తివంతమైన కార్లు కూడా గంటకు సున్నా నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ సాధించలేవు.

Latest Videos

undefined

రిమాక్ నవారా మోటార్ ఎలా ఉంటుందంటే
ఈ కారును గంటకు 412 కి.మీ వేగంతో ఇంకా సున్నా నుండి 100 కి.మీల స్పీడ్ కేవలం రెండు సెకన్లలోపే అందుకోగలదు. కాబట్టి ఈ కారులో చాలా శక్తివంతమైన మోటారు  అమర్చారు. అందులో ఒకటి కాదు నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు వాడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కారణంగా కారు 1914 bhp వరకు శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసిన వారు ఇప్పటివరకు ఈ కారు గరిష్టంగా గంటకు 352 కిలోమీటర్ల స్పీడ్ తో నడపడాన్ని చూశారు.

టెస్టింగ్ సమయంలో రికార్డ్ 
నివేదికల ప్రకారం ఈ రికార్డ్ సాధించిన మొదటి ఎలక్ట్రిక్ కారు. సమాచారం ప్రకారం, టెస్టింగ్ సమయంలో కంపెనీ ఈ కారుని నాలుగు కిలోమీటర్ల స్ట్రెయిట్ రోడ్డు పై నడిపించారు. ఆ సమయంలో ఈ రికార్డ్  సాధించింది.
 

click me!