మెక్లారెన్ కంపెనీ ఇప్పుడు అధికారికంగా భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో కంపెనీ మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ 765ఎల్‌టి కారుని భారత్ కోసం సూపర్‌కార్‌గా పరిచయం చేసింది.
బ్రిటిష్ లగ్జరీ ఆటోమోటివ్ కంపెనీ మెక్‌లారెన్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ సూపర్ కార్ కంపెనీ ఇండియాలోకి వస్తుందని చాలా కాలంగా కార్ లవర్స్ ఎంతో ఎదురుచూశారు. కొంతకాలం క్రితం 2022 సంవత్సరంలో అధికారికంగా భారతదేశంలోకి ప్రవేశిస్తున్నట్లు కంపెనీ కూడా తెలియజేసింది. అయితే కంపెనీ మొట్టమొదటి షోరూమ్‌ను ఇండియాలోని ముంబైలో ప్రారంభించింది.
ఇండియాలోకి మెక్‌లారెన్
మెక్‌లారెన్ కంపెనీ ఇప్పుడు అధికారికంగా భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో కంపెనీ మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ 765ఎల్‌టి కారుని భారత్ కోసం సూపర్‌కార్‌గా పరిచయం చేసింది. అంతేకాకుండా, కంపెనీకి చెందిన చాలా కార్లు ఇప్పుడు భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఇన్ఫినిటీ కార్లతో కంపెనీ మొదటి షోరూమ్‌ని లాంచ్ చేసింది.
కంపెనీ ఏ కార్లను భారత్‌కు తీసుకువస్తుందంటే..?
కంపెనీ మొదటి షోరూమ్ ప్రారంభోత్సవంలో కంపెనీ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ భారత్‌కు సంబంధించి మా సంస్థ ప్రత్యేక ప్లాన్ తో ఉందన్నారు. రాబోయే కాలంలో కంపెనీ చాలా కార్లను భారతదేశానికి తీసుకువస్తుంది. వీటిలో ఆర్టురా హైబ్రిడ్ 2023 కూడా ఉంది. అంతేకాకుండా 720 S Coupe, Spyder, 765 LT Coupe వంటి సూపర్ కార్లను కూడా భారత్‌కు తీసుకురానుంది.
765 LT చాలా స్పెషల్
మెక్‌లారెన్ 765 LT చాలా ప్రత్యేకమైన సూపర్‌కార్. ఈ కార్ 755 bhp, 800 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఫోర్-లీటర్ V8 పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తినిస్తుంది. శక్తివంతమైన ఇంజన్ కారణంగా ఈ కారు కేవలం 2.8 సెకన్లలో సున్నా నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 330 కిలోమీటర్లు. కారు చాలా తేలికగా ఉండేలా ప్రత్యేక రకమైన కార్బన్ ఫైబర్‌తో తయారు చేసారు.