మీ బైక్ ఆవరేజ్ మైలేజ్ తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఇలా చిటికెలో తెలుసుకోండి..

By asianet news telugu  |  First Published Oct 10, 2022, 1:18 PM IST

 ఈ విధంగా బైక్  సరైన ఆవరేజ్ మైలేజ్ తెలుసుకోవచ్చు. ముందుగా పెట్రోల్‌ పంప్‌కి వెళ్లి మీ బైక్ పెట్రోల్ ట్యాంక్‌ నింపండి. దీని తర్వాత స్పీడోమీటర్‌లో బైక్ కిలోమీటర్‌ గమనించండి. 


ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వల్ల బైక్ ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటుంటారు. దీనికి కారణం ఏమిటంటే, బైక్ ఆవరేజ్ కంటే ఎక్కువ మైలేక్ ఇస్తే మీ పాకెట్ మని పై ప్రభావం కాస్త తగ్గుతుంది. చాలా కంపెనీలు బైక్ ఆవరేజ్ మైలేజ్ గురించి సమాచారాన్ని ఇస్తాయి, అయితే ఆవరేజ్ మైలేజ్ రియల్  టైమ్ లో అందుబాటులో లేదు. బైక్ ఆవరేజ్ మైలేజ్ ఎలా ఉంటుందో  చూద్దాం..

చాలా సులభమైన మార్గంలో
 ఈ విధంగా బైక్  సరైన ఆవరేజ్ మైలేజ్ తెలుసుకోవచ్చు. ముందుగా పెట్రోల్‌ పంప్‌కి వెళ్లి మీ బైక్ పెట్రోల్ ట్యాంక్‌ నింపండి. దీని తర్వాత స్పీడోమీటర్‌లో బైక్ కిలోమీటర్‌ గమనించండి. అంతేకాకుండా, మీకు కావాలంటే మీరు బైక్ ట్రిప్ మీటర్‌ను కూడా సెట్ చేయవచ్చు.

Latest Videos

undefined

మీరు బైక్ పెట్రోల్ ట్యాంక్‌ నింపి, రీడింగ్‌ చూసిన తర్వాత మీరు బైక్‌ను నడిపే విధానంలో నడపండి. మీరు బైక్ నడిపే విధానంలో ఎలాంటి మార్పులు చేయవద్దు.

పెట్రోల్ అయిపోయితే
ఒక్కోసారి బైక్‌లో పెట్రోల్ అయిపోతే లేదా రిజర్వ్‌లోకి వస్తే మళ్లీ పెట్రోల్ పంపు వద్దకు వెళ్లి బైక్ ఫ్యూయెల్  ట్యాంక్ నింపండి.

ఆవరేజ్ మైలేజ్
మళ్లీ పెట్రోల్ పోసిన తర్వాత మీ బైక్‌లో ఎన్ని లీటర్ల పెట్రోల్ వచ్చిందో చూడండి. దీని తర్వాత మీ బైక్ ఎన్ని కిలోమీటర్లు నడిచిందో స్పీడోమీటర్‌లో చూడండి. కిలోమీటరును చూసిన తర్వాత నింపిన ఫ్యుయెల్ తో భాగించండి.

ఇలా చేయండి
ఉదాహరణకు పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత మీ బైక్‌లో 10 లీటర్ల పెట్రోల్ వస్తుంది. దీని తర్వాత మీ బైక్ 500 కి.మీ ప్రయాణించింది అనుకోండి. పెట్రోల్ ట్యాంక్‌ రీఫిల్ చేసినపుడు మీ బైక్‌కి మళ్లీ 10 లీటర్లతో ఉంటుంది. కాబట్టి మీరు 500 కి.మీలను 10 లీటర్లతో భాగిస్తే మీ బైక్ ఒక లీటర్ కి 50 కి.మీ ఇస్తుందని. ఈ విధంగా మీరు మీ బైక్ ఆవరేజ్ మైలేజ్ తెలుసుకోవచ్చు.

click me!