150 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్ కావాలా.. ? ఫీచర్స్ లోనే కాదు, ధరలో కూడా..!

Published : May 13, 2023, 05:45 PM IST
150 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్ కావాలా.. ? ఫీచర్స్ లోనే కాదు, ధరలో కూడా..!

సారాంశం

స్కూటర్ ప్యూర్ EV ఎకోడ్రిఫ్ట్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది. iPluto 7G Pro స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న AIS 156 సర్టిఫైడ్ 3.0 kWh బ్యాటరీ  ఉంది. ఈ బ్యాటరీ సాంకేతికత ఎకోడ్రిఫ్ట్ మోటార్‌సైకిల్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఉపయోగించబడుతుంది. 

హైదరాబాద్ చెందిన ఎలక్ట్రిక్ EV స్టార్టప్ కంపెనీ ప్యూర్ ఎలక్ట్రిక్ కొత్త ePluto 7G Pro ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త EV ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్). iPluto 7G ప్రో ఇప్పుడు భారతదేశం అంతటా మూడు ఆకర్షణీయమైన కలర్స్ లో అందుబాటులో ఉంది - మ్యాట్ బ్లాక్, గ్రే అండ్ వైట్. iPluto 7G ప్రో కోసం బుకింగ్‌లు ఇప్పుడు అన్ని ప్యూర్ EV డీలర్‌షిప్‌లలో ఓపెన్ అయ్యాయి . మే చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయి.

స్కూటర్ ప్యూర్ EV ఎకోడ్రిఫ్ట్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది. iPluto 7G Pro స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న AIS 156 సర్టిఫైడ్ 3.0 kWh బ్యాటరీ  ఉంది. ఈ బ్యాటరీ సాంకేతికత ఎకోడ్రిఫ్ట్ మోటార్‌సైకిల్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఉపయోగించబడుతుంది. స్కూటర్ 2.4 KW మోటార్ కంట్రోల్ యూనిట్ (MCU), CAN  ఛార్జర్‌తో 1.5 KW మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇంకా  మూడు వేర్వేరు మోడ్‌లలో 100 కి.మీ నుండి 150 కి.మీల పరిధిని అందిస్తుంది. అలాగే మూడు వేర్వేరు మోడ్‌లలో డ్రైవ్ చేయవచ్చు. మీరు 100-150 కి.మీ వరకు స్కూటర్‌ను నడపవచ్చు. 

ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, నాలుగు మైక్రో కంట్రోలర్‌లు, స్మార్ట్ BMS అండ్ LED హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ దీనితో పాటు OTA ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌లను నిర్వహించగలదు. అలాగే, స్మార్ట్ BMS వంటి ఫీచర్లు అందించబడ్డాయి.

 అయితే, ఆన్-రోడ్ ధరలు రాష్ట్ర స్థాయి సబ్సిడీలు, ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) ఛార్జ్  బట్టి మారవచ్చు.

లాంచ్ కాకుండా, భారతదేశంలోని ప్రముఖ నగరాలు, పట్టణాలలో డీలర్ నెట్‌వర్క్‌ను చురుకుగా విస్తరిస్తున్నట్లు ప్యూర్ EV పేర్కొంది. FY2024 చివరి నాటికి, కంపెనీ 300 కంటే ఎక్కువ టచ్ పాయింట్లను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్యూర్ EV సహ వ్యవస్థాపకుడు అండ్  CEO రోహిత్ వధేరా మాట్లాడుతూ, "అత్యంత ప్రజాదరణ పొందిన 7G మోడల్ అప్‌గ్రేడ్ వెర్షన్ మా కస్టమర్‌ల కోసం ఆవిష్కరణ, స్థిరత్వం, శ్రేష్ఠత పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. iPluto 7G Pro  స్కూటర్ల కోసం వెతుకుతున్న వినియోగదారుల అవసరాలను తీరుస్తుందని ఇంకా  ప్రీ-లాంచ్ దశలో 5000 కంటే ఎక్కువ ఎంక్వయిరీ  స్వీకరించడం సంతోషంగా ఉందని, విడుదలైన మొదటి నెలలోనే 2000 కంటే ఎక్కువ బుకింగ్‌లను ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Jeep Grand Cherokee : ఈ కారుపై ఇస్తున్న డిస్కౌంట్ మరో కారే కొనొచ్చు... ధర ఎంత తగ్గిందో తెలుసా?
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు