స్కోడా ఆటో వోక్స్ వేగన్ ఇండియా 2019 డిసెంబర్ మధ్య నుండి 2020 జనవరి మధ్య వరకు వోక్స్ వేగన్ చకన్ ప్లాంట్లో ఉత్పత్తిని నిలిపివేస్తుందని తెలిపింది.అయితే మేము వోక్స్ వేగన్ సంబంధిత వ్యక్తితో మాట్లాడినప్పుడు ఈ నివేదిక పూర్తిగా అబద్దం అని మాకు చెప్పారు.
స్కోడా ఆటో వోక్స్ వేగన్ ఇండియా 2019 డిసెంబర్ మధ్య నుండి 2020 జనవరి మధ్య వరకు వోక్స్ వేగన్ చకన్ ప్లాంట్లో ఉత్పత్తిని నిలిపివేస్తుందని తెలిపింది.స్కోడా ఆటో వోక్స్ వేగన్ ఇండియా మహారాష్ట్రలోని పూణే సమీపంలో తన చకన్ ప్లాంట్‌ను 30 రోజుల పాటు మూసివేస్తుందని తెలిపింది. ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం డిసెంబర్ 2019 నుండి జనవరి 2020 మధ్య కాలంలో చకన్ ప్లాంట్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది అని ఆ నివేదికలో ఉంది.
ఈ తాత్కాలిక షట్డౌన్ కి అనేక కారణాలు ఉండొచ్చు. ఇందులో ఎగుమతుల అంతగా లేకపోవడం, దేశీయ అమ్మకాలు దాని కనిష్టానికి పడిపోవటం, అమియో సబ్ కాంపాక్ట్ సెడాన్ కార్లు మరియు డీజిల్ ఇంజన్ల నిలిపివేత.
also read మానేసర్ ప్లాంట్ లో మళ్ళీ మొదలైన హోండా టువీలర్ ఉత్పత్తి
అయితే మేము వోక్స్ వేగన్ సంబంధిత వ్యక్తితో మాట్లాడినప్పుడు ఈ నివేదిక పూర్తిగా అబద్దం అని మాకు చెప్పారు. ఆ వ్యక్తి మాతో మాట్లాడుతూ "ఉత్పత్తిని నిలిపివేయడం కంపెనీ వార్షిక నిర్వహణలో ఒక భాగం అని అయితే స్కోడా ఆటో వోక్స్ వేగన్ రాబోయే ఇండియా 2.0 ప్రాజెక్ట్ కోసం ప్లాంట్ సిద్ధం చేస్తున్నాం అని అలాగే కంపెనీ కొత్త మొదటి MQB A0 IN ప్లాట్‌ఫాం కోసం అని" కూడా చెప్పారు. అయితే ఈ వార్తా పై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ ఏడాది కంపెనీ చకన్ ప్లాంట్‌ను మూసివేయడం ఇది మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా కంపెనీ అక్టోబర్ నుండి నవంబర్ మధ్యలో ఉత్పత్తిని నిలిపివేసింది. అలాగే కంపెనీ చెప్పేది ఏమిటంటే కంపెనీలో పడిపోతున్న అమ్మకాలే దీనికి కారణమని చెప్పలేము.
also read మారుతి సుజుకి బంపర్ ఆఫర్..కార్లపై అదిరిపోయే డిస్కౌంట్
వాస్తవానికి గత నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలు కేవలం 3,213 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి మరియు అక్టోబర్ 2019 మధ్య కంపెనీ సగటు అమ్మకాలు నెలకు 2500 యూనిట్లు. కంపెనీ ఎగుమతులు ఏప్రిల్-అక్టోబర్ 2019 మధ్య కూడా 11 శాతం తగ్గాయి, పరిశ్రమల ఎగుమతులు కూడా 3 శాతం పెరిగాయి.
సంస్థ యొక్క MQB A0 IN ప్లాట్‌ఫామ్ విషయానికొస్తే కార్‌మేకర్ రాబోయే ఆటో ఎక్స్‌పో 2020 లో కాన్సెప్ట్ కారును ప్రదర్శించనున్నారు. ఉత్పత్తి మోడల్ అయిన వాస్తవానికి చాలా ఊహించిన ఇండియా-స్పెక్ వోక్స్ వేగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా దీనిని భావిస్తున్నారు. 2020 మధ్యలో అంటే మే నెలలో దాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. స్కోడా తన కొత్త ఇండియా-స్పెక్ కరోక్ విడుదల చేయనుంది. ఇది కూడా MQB A0 IN ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది.