ఇండియాలో వోక్స్‌వ్యాగన్ ఆ కార్లకు గుడ్ బై.. కారణం అందుకేనా..?

By asianet news teluguFirst Published Jan 29, 2022, 3:36 AM IST
Highlights

వోక్స్‌వ్యాగన్ ఇండియా వెంటోకు ప్రత్యామ్నాయంగా మార్చిలో సరికొత్త వర్టస్‌ను ఆవిష్కరిస్తుంది అలాగే మే 2022 నుండి షోరూమ్‌లలోకి వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా, కంపెనీ పాత వెంటో మిడ్-సైజ్ సెడాన్‌ను దశలవారీగా తొలగించడం ప్రారంభించింది. 

జర్మన్ వాహన తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తాజాగా వెంటో సెడాన్‌  కార్ల ఉత్పత్తిని  నిలిపివేస్తున్నట్లు  ప్రకటించింది. ఈ కార్ ఒక దశాబ్దం పాటు కంపెనీ ఏకైక మిడ్-సైజ్ సెడాన్ కారుగా అందుబాటులో ఉంది. అయితే  ఇప్పుడు వెంటో శ్రేణిని కేవలం మూడు వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

వోక్స్‌వ్యాగన్ ఇండియా వెంటోకు ప్రత్యామ్నాయంగా మార్చిలో సరికొత్త వర్టస్‌ను ఆవిష్కరిస్తుంది అలాగే మే 2022 నుండి షోరూమ్‌లలోకి వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా, కంపెనీ పాత వెంటో మిడ్-సైజ్ సెడాన్‌ను దశలవారీగా తొలగించడం ప్రారంభించింది. 

ఈ ట్రిమ్‌లలో అందుబాటులోకి 
వోక్స్‌వ్యాగన్ వెంటో  హైలైన్ ప్లస్ ఎం‌టి(Highline Plus MT) అండ్ కంఫర్ట్‌లైన్ (Comfortline) వేరియంట్‌లను నిలిపివేసింది. మిడ్-సైజ్ సెడాన్ ఇప్పుడు హైలైన్ ఎం‌టి, హైలైన్ ఏ‌టి, హైలైన్ ప్లస్ ఏ‌టి ((Highline Plus AT) ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో  ఉండనుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 

గత ఏడాదిలో ప్రారంభించిన మ్యాట్ ఎడిషన్
ఫోక్స్‌వ్యాగన్ గత ఏడాది వెంటో మ్యాటే ఎడిషన్ (Vento Matte Edition))ని పరిచయం చేసింది. అయితే రూ. 13.37 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలతో మ్యాటే ఎడిషన్ ఫినిష్ ఎక్స్‌టీరియర్ పెయింట్‌తో వస్తుంది. 

రాబోయే కొత్త సెడాన్
విర్టస్ సెడాన్  ఇప్పుడు  MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. కొత్త మిడ్-సైజ్ సెడాన్  స్పెసిఫికేషన్లను స్కోడా స్లావియాతో వస్తుంది. విర్టస్ 1.0-లీటర్ అండ్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌లతో అందించబడుతుందని భావిస్తున్నారు. 

స్లావియాలో  ఈ ఇంజన్ 113 BHP పవర్ ఇంకా 175 Nm టార్క్ అలాగే 148 BHP పవర్ ఇంకా 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌లతో స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందించబడుతుంది. 1.0-లీటర్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్ పొందుతుంది. 1.5-లీటర్ ఇంజన్ 7-స్పీడ్ డి‌ఎస్‌జితో అందుబాటులో ఉంటుంది.
 

click me!