Royal Enfield new bikes: రాయల్​ ఎన్​ఫీల్డ్ నుంచి అదిరిపోయే కొత్త బైక్​లు..!

By team telugu  |  First Published Jan 23, 2022, 7:04 PM IST

ప్రముఖ మోటార్​ బైక్​ల తయారీ సంస్థ రాయల్ ఎన్​ఫీల్డ్ పోర్ట్​ ఫోలియో విస్తరపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది భారీ సంఖ్యలో కొత్త బైక్​లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 


ప్రముఖ మోటార్​ బైక్​ల తయారీ సంస్థ రాయల్ ఎన్​ఫీల్డ్ పోర్ట్​ ఫోలియో విస్తరపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది భారీ సంఖ్యలో కొత్త బైక్​లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త బైక్​లలో ఇప్పటికే కొన్ని ఇప్పటికే టెస్టింగ్​ దశకు (Royal Enfield new models) చేరుకున్నట్లు సమాచారం. రాయల్ ఎన్​ఫీల్డ్​ నుంచి గత ఏడాది క్లాసిక్ 350 మార్కెట్లోకి వచ్చింది. అంతకు ముందు సంవత్సరం మిటియర్ 350 మోడల్​న విడుదల చేసింది. ఇక ఈ ఏడాది 4 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసే (Four new bikes from Royal Enfield) అవకాశముంది.

సూపర్ మిటియర్​ 650 (Royal Enfield Super Meteor 650)

Latest Videos

undefined

ఇంటర్​సెప్టర్​ 650 కన్నా ప్రీమియం మోడల్​గా సూపర్ మిటియర్ 650 మోడల్ అందాబుటులోకి రానుంట. ఇందులో 648 సీసీ, ట్విన్ సిలిండర్ ఇంజిన్​తో రానుంది. ఈ ఇంజిన్​ అత్యధికంగా 52 ఎన్​ఎం టార్క్​ను విడుదల చేస్తుందని సమాచారం. ఈ బైక్​ను ఏప్రిల్​లో విడుదల చేసేందుకు రాయల్​ ఎన్​ఫీల్డ్ సన్నాహాలు చేస్తొంది.

హంటర్​ (Royal Enfield Hunter)

బడ్జెట్​ సెగ్మెంట్​లోని 350 సీసీ రోడ్​స్టర్ మోటార్​ సైకిల్​ను కూడా తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది రాయల్​ ఎన్​ఫీల్డ్. ప్రస్తుతం ఈ బైక్​ను హంటర్ అని పిలిస్తున్నా.. పేరు మార్చే అవకాశాలున్నాయి. ఈ  బైక్​ విడుదలైన తర్వాత రాయల్ ఎన్​ఫీల్డ్ పోర్ట్​ఫోలియోలో అత్యంత చౌకైన మోడల్​ కావచ్చని అంచనాలున్నాయి. జూన్, జులై సమయంలో ఈ బైక్ మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.

స్క్రామ్​ 411 (Royal Enfield  Scram 411)

రాయల్​ ఎన్​ఫీల్డ్ అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్​లోని హిమాలయన్​కు అడ్వాన్స్​డ్​గా ఈ బైక్​ రానున్నట్లు సమాచారం. స్క్రామ్​ 411 డిజైన్​ చాలా వరకు హిమాలయన్​ను పోలి ఉండనుందంట. అయితే వీల్స్ మాత్రం కాస్త చిన్నగా ఉండనున్నాయని సమాచారం. ఇంజిన్ సామర్థ్యం కూడా హిమాలయన్​ బైక్​లానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి.

షాట్​గన్​ 650 (Royal Enfield Shotgun 650)

షాట్‌గన్ 650 సింగిల్ సీటర్ బాబర్. SG650 అనే పేరుతో ఈ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్​ను EICMA 2021లో ప్రదర్శించింది రాయల్ ఎన్​ఫీల్డ్​. ఇందులో ఇంటర్​సెప్టార్​ 650, కాంటినెంటల్ జీటీ 650ల్లానే ట్విన్​ సిలిండర్ ఇంజిన్​ ఉండనుందట. ఈ బైక్​ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. కొత్త బైక్​లతో పాటు.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ జే ప్లాట్‌ఫామ్​పై బుల్లెట్​, బుల్లెట్ ఈఎస్​ వంటి బైక్​లను తీసుకురానుంది.

click me!