కొత్త iOS సపోర్ట్‌తో పాటు బైక్ లో ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు. ఫుల్ -LED లైటింగ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంజన్ ఇన్హిబిటర్‌లతో కూడిన సైడ్-స్టాండ్ అండ్ డ్యూయల్-ఛానల్ ABS వంటి ఫీచర్లను పొందుతుంది.
హోండా 2వీలర్స్ ఇండియా (honda 2wheelers) HNess CB350 బైక్ కోసం హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కమాండ్ (honda smartphone voice command) సిస్టమ్ కోసం iOS ఇంటిగ్రేషన్‌ను లాంచ్ చేసింది. ఇంతకుముందు ఈ బైక్ ఆండ్రాయిడ్ ఆటో సిస్టమ్‌తో మాత్రమే వచ్చింది. కంపెనీ హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కమాండ్ సిస్టమ్ బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయడం ద్వారా పని చేస్తుంది ఇంకా కాల్స్, మెసేజెస్, నావిగేషన్ సమాచారాన్ని చూపిస్తుంది.
అయితే ఈ ఫీచర్ బైక్ హై-స్పెక్ DLX ప్రో (DLX pro) అండ్ యానివర్సరీ ఎడిషన్ (anniversary edition) ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. డీఎల్‌ఎక్స్ ప్రో ధర రూ.2,03,179గా ఉండగా, యానివర్సరీ ఎడిషన్ ధర రూ.2,05,679. రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ చెందినవి.
ఇంజిన్ అండ్ సస్పెన్షన్
HNess CB350 బైక్ 348.3cc, సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో శక్తిని పొందింది. ఈ ఇంజన్ 5,500rpm వద్ద 21bhp శక్తిని, 3,000rpm వద్ద 30Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. బైక్ హార్డ్‌వేర్ కిట్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ స్ప్రింగ్‌లు, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
ఫీచర్లు
కొత్త iOS సపోర్ట్‌తో పాటు బైక్ లో ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు. ఫుల్ -LED లైటింగ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంజన్ ఇన్హిబిటర్‌లతో కూడిన సైడ్-స్టాండ్ అండ్ డ్యూయల్-ఛానల్ ABS వంటి ఫీచర్లను పొందుతుంది.
హోండా పాపులర్ Activa 125, Activa 6G స్కూటర్ల ధరలను మళ్లీ పెంచింది. ఈ రెండు స్కూటర్ల ధరలు రూ.500 నుంచి రూ.1,000 వరకు పెరిగాయి. తాజాగా పెంపు ధర ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఉంటుంది. Honda Activa 6G ధర ఇప్పుడు రూ. 71,432 నుండి ప్రారంభమవుతుంది, Activa 125 ప్రారంభ ధర ఇప్పుడు రూ. 74,989 నుండి ప్రారంభమవుతుంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ చెందినవి.