Peugeot Django: రెట్రో మోడల్‌లో ప్యుగోట్ స్పెషల్ ఎడిషన్ స్కూటర్.. ధ‌ర ఎంతంటే..?

By team teluguFirst Published Jun 19, 2022, 3:23 PM IST
Highlights

ప్యుగోట్ మోటార్‌సైకిల్స్ జంగో 125 ఎవర్షన్ ABS ప్లస్ (Peugeot Django 125) పేరుతో రెట్రో-స్కూటర్‌లో ప్రత్యేక ఎడిషన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది.
 

ఫ్రెంచ్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ, ప్యుగోట్ మోటార్‌సైకిల్స్ తమ బ్రాండ్ నుంచి 125సీసీ రెట్రో-స్కూటర్‌లో ప్రత్యేక ఎడిషన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. జంగో 125 ఎవర్షన్ ABS ప్లస్ (Peugeot Django 125)  పేరుతో విడుదలైన ఈ మోడల్ స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే కొన్ని కొన్ని అదనపు హంగులతో వచ్చింది. అంతేకాకుండా ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 50 యూనిట్లకు పరిమితం చేసింది.

ఎవర్షన్ ABS ప్లస్ కూడా దాని స్టాండర్డ్ మోడల్ జంగో 125 స్టైలింగ్‌ను అందిపుచ్చుకుంది. ఇది వెస్పా-వంటి ముందు భాగం కలిగి పొడవైన సైడ్ ప్యానెల్‌లను కలిగి ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌లో ట్రాన్స్పరెంట్ విండ్‌స్క్రీన్, వెనక కూర్చునే వాళ్ల సౌకర్యం కోసం పిలియన్ బ్యాక్‌రెస్ట్ ప్రత్యేకంగా ఇచ్చారు. అలాగే జంగో ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను డ్రాగన్ రెడ్, డీప్ ఓషన్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఛాయిస్ లలో అందిస్తున్నారు. ఈ రెండు పెయింట్ స్కీమ్‌లలోనూ టూ-టోన్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. స్కూటర్‌ పైభాగం వైట్ థీమ్‌లో ఉంచి, దిగువ భాగం అద్భుతమైన స్ట్రైకింగ్ రెడ్ కలర్‌లో ఇచ్చారు. దీంతో ఈ స్కూటర్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఓషన్ బ్లూకి కూడా ఇదే నమూనా.

ఇంజన్ కెపాసిటీ

Peugeot Django ఎవర్షన్ రెట్రో-స్కూటర్‌లో 125cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10.46 bhp పవర్ అలాగే 9.3 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. సస్పెన్షన్ కోసం స్కూటర్ ముందువైపు సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్‌లను ఇవ్వగా, వెనుక వైపు మాత్రం ఒకే షాక్-అబ్జర్‌ను ఇచ్చారు. బ్రేకింగ్ హార్డ్‌వేర్‌లో 200mm ఫ్రంట్ డిస్క్, 190mm వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. రెండువైపులా 12 అంగుళాల టైర్లను అమర్చారు.

ధర ఎంతంటే..?

ఫ్రెంచ్ మార్కెట్‌లో ప్యుగోట్ జంగో 125 ఎవర్షన్ ABS ప్లస్ ధర EUR 3,249 గా ఉంది. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 2.66 లక్షలు. ఇది బజాజ్ చేతక్, వెస్పా లాంటి స్కూటర్లతో పోటీలో నిలిచినా భారతీయ మార్కెట్లో ఇది చాలా ఖరీదైన బైక్. అలాగే కంపెనీ ఇండియాలో ప్రత్యేకంగా విడుదల చేయడం లేదు. కాబట్టి స్కూటర్ ను ఇండియాకు దిగుమతి చేసుకుంటే అందుకు అదనపు ఖర్చు కూడా భరించాల్సి వస్తుంది.

click me!