Ukraine Russia War:కార్లు, ఆటో విడిభాగాల ఎగుమతిపై రష్యా నిషేధం, తీవ్రమవుతున్న చిప్ సంక్షోభం..

By asianet news telugu  |  First Published Mar 11, 2022, 5:00 PM IST

ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో  రష్యా దేశంపై విధించిన ఆంక్షల తర్వాత కార్లు, ఆటో విడిభాగాలు సహా 200కి పైగా ఉత్పత్తుల ఎగుమతిపై నిషేధం విధించాలని రష్యా నిర్ణయించింది.


ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా  దేశంపై ప్రపంచదేశాలు, దిగ్గజ కంపెనీల నుండి ఆంక్షలు వెల్లువెతాయి. తాజాగా కార్లు, ఆటో విడిభాగాలు సహా 200కి పైగా ఉత్పత్తుల ఎగుమతిపై నిషేధం విధించాలని రష్యా నిర్ణయించింది. రష్యా  ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం రష్యాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆటో పరిశ్రమను ప్రభావితం చేస్తోంది. ఈ నిర్ణయంతో ఆటోమొబైల్ తయారీదారులు ఎదుర్కొంటున్న సెమీకండక్టర్ చిప్ సంక్షోభం రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానుంది. 

కార్లు, ఆటో విడిభాగాల ఎగుమతిపై రష్యా విధించిన నిషేధం ఈ ఏడాది చివరి వరకు కొనసాగనుంది. రష్యా  ఎగుమతి జాబితా నుండి తొలగించబడిన వస్తువులలో వాహనాలు, టెలికమ్యూనికేషన్స్, ఔషధం, వ్యవసాయం, విద్యుత్ పరికరాలు, కలప ఉన్నాయి. గురువారం మాస్కో "రష్యాకు వ్యతిరేకంగా శత్రు చర్యలు తీసుకుంటున్న రాష్ట్రాలకు కలప, కలప ఉత్పత్తుల ఎగుమతిని నిలిపివేసినట్లు" తెలిపింది. 

Latest Videos

undefined

"ఈ చర్యలు రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలకు తాత్కాలిక ప్రతిస్పందన అలాగే ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలు సజావుగా పని చేసే లక్ష్యంతో ఉన్నాయి" అని రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 

దేశంలో కార్యకలాపాలను అడ్డుకునే పాశ్చాత్య కంపెనీలకు చెందిన అన్ని ఆస్తులను జాతీయం చేస్తామని బెదిరింపుల మధ్య రష్యా ఈ చర్య తీసుకుంది. గత నెలలో వివాదం తీవ్రరూపం దాల్చడంతో  చాలా వరకు కార్ల తయారీదారులు రష్యాలో కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. వోల్వో, ఫెరారీ, హోండా, టయోటా, ఫోక్స్‌వ్యాగన్, జనరల్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఫోర్డ్, బిఎమ్‌డబ్ల్యూ వంటి కార్ల తయారీదారులు తమ కార్యకలాపాలను నిలిపివేయడమే కాకుండా దేశంలో తమ వాహనాల ఎగుమతిపై నిషేధం విధించారు. 

జీప్, ఫియట్, ప్యుగోట్ వంటి బ్రాండ్‌లు ఉన్న స్టెల్లాంటిస్ గ్రూప్ కూడా గురువారం ఈ ఆటోమేకర్ల జాబితాలో చేరింది. రష్యా నుండి కార్ల దిగుమతి అండ్ ఎగుమతిని నిలిపివేసినట్లు కంపెనీ తెలిపింది. స్టెలాంటిస్‌కి రష్యాలోని కలుగాలో ఒక తయారీ కర్మాగారం ఉంది.

రష్యాలోని ప్రధాన విదేశీ కార్ల తయారీదారులలో ఒకటైన హ్యుందాయ్ ఇటీవలే ఉత్పత్తిని పునఃప్రారంభించాలని చూస్తున్నట్లు ప్రకటించింది, అయితే సరఫరా చైన్ అంతరాయాల కారణంగా కొంతకాలం ఆగిపోయింది. అయితే కార్లు, ఆటో విడిభాగాల ఎగుమతిపై రష్యా నిషేధం కొనసాగితే హ్యుందాయ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం కష్టం. 

ఇతర కార్ల తయారీదారులలో రెనాల్ట్ కూడా కొనసాగుతున్న యుద్ధ  భారాన్ని ఎదుర్కొంటోంది. ఇది లాడా కార్లను తయారు చేసే ఫ్రెంచ్ కంపెనీ అవోటోవాజ్ యాజమాన్యంలో ఉంది.  అలాగే రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్. కంపెనీ  ఉత్పత్తిని కొనసాగించడానికి మైక్రోచిప్‌ల దేశీయ సరఫరాను కోరుతుందని పేర్కొంది.
 

click me!