బీఎస్-6 స్టాండర్డ్‌తో టీవీఎస్ అపాచీ బైక్స్ రెడీ.. బట్ ధరెంతంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Nov 27, 2019, 12:42 PM IST

బీఎస్ -6 ప్రమాణాలతోపాటు అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లతో ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తాజాగా విపణిలోకి అపాచీ ఆర్టీఆర్ 200 4వీ, ఆర్టీఆర్ 160 4వీ బైక్స్ ను ఆవిష్కరించింది. 


న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటర్స్ బీఎస్ -6 ప్రమాణాలతో రూపొందించిన రెండు బైక్స్‌ను మంగళవారం విపణిలో ఆవిష్కరించింది. వీటిలో అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ, అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ పేర్లతో విడుదల చేసిన ఈ బైకులు గరిష్ఠంగా రూ.1.24 లక్షలకు లభించనున్నాయి. 

ఆర్‌టీఆర్ 4వీ మోటార్‌సైకిల్‌ను రేస్ గ్రాఫిక్స్, నూతన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతోపాటు ఇతర కొత్త ఫీచర్లతో విడుదల చేసింది. 197.55 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్ కలిగిన ఆర్‌టీఆర్ 200 4వీ-డీసీ ధరను రూ.1.24 లక్షలుగా, అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ(డిస్క్) ధరను రూ.1.03 లక్షలుగా నిర్ణయించింది. 

Latest Videos

also read  మారుతి సుజుకి మరో రికార్డు... మొదటి స్థానంలో మారుతీ ఆల్టో

వీటితోపాటు రూ.99,950 విలువైన ఆర్‌టీఆర్ 160 4వీ (డ్రమ్)ను టీవీఎస్ మోటార్స్ ప్రవేశపెట్టింది. 159.7 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైకును సింగిల్ సిలిండర్‌తో తయారు చేసింది. 2020 సంవత్సరానికి విడుదల చేసిన ఈ రేస్ బైకులో ‘ఆర్టీ-ఎఫ్ఐ’ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ కలిగి ఉండటం విశేషమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

గ్లైడ్ థ్రో ట్రాఫిక్ సామర్థ్యం గల ఈ బైక్ స్పోర్ట్స్ అట్రాక్టివ్ రేస్ గ్రాఫిక్స్‌తో ఈ బైక్స్ రూపుదిద్దుకున్నాయి. ఈ సందర్భంగా టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం మోటారు సైకిల్స్ మార్కెటింగ్ హెడ్ మేఘాశ్యామ్ డిఘోలే మాట్లాడుతూ బీఎస్ -6 ప్రమాణాలతో 2020 రేంజ్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ, టీవీఎస్ ఆర్టీఆర్ 160 4వీ బైక్స్ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అపాచీ కస్టమర్ల ట్రూ రేసింగ్ కోసం నిబద్ధతతో పని చేస్తున్నట్లు చెప్పారు.

also read వోక్స్ వేగన్ కార్ల ఉత్పత్తి నిలిపివేత....?

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ అడ్వాన్స్‌డ్ ఇంజిన్, 197.75 సీసీ సింగిల్ సిలిండర్, 4-స్ట్రైక్, 4-వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ మోటార్ అండ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 8500 ఆర్పీఎం విత్ 16.8 ఎన్ఎం టార్చి శక్తి విడుదల చేసే సామర్థ్యం గల 20.5 పీఎస్ ఆఫ్ పవర్ ఇంజిన్ దీని సొంతం. ఇంకా డ్యూయల్ చానెల్ ఏబీఎస్, రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ కంట్రోల్, ఆర్టీ స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 

టీవీఎస్ అపాచీ 160 4వీ మోటార్ బైక్ అడ్వాన్స్‌డ్ 159.7 సీసీ ఇంజిన్, సింగిల్ సిలిండర్, 4 -స్ట్రోక్, 4-వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్, 8250 ఆర్పీఎం వద్ద 16.02 పీఎస్, 7250 ఆర్పీఎం వద్ద 14.12 ఎన్ఎం టార్చి శక్తిని ఆవిష్కరించే సామర్థ్యం దీని సొంతం. 5-స్పీడ్ సూపర్ స్లిక్ గేర్ బాక్స్, న్యూ డ్యుయల్ సీట్, న్యూ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ విత్ క్లా స్టైల్డ్ పొజిషన్ లాంప్స్ జత కలిశాయి. 

click me!