Toyota Mirai:భారతీయ రోడ్లపై ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యంత లేటెస్ట్ హైడ్రోజన్ కార్.. టెయిల్ పైప్‌ల నుండి నీటిని

By asianet news telugu  |  First Published Mar 19, 2022, 2:17 PM IST

టయోటా మిరాయ్ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FCEV) అండ్ స్వచ్ఛమైన హైడ్రోజన్ నుండి ఉత్పత్తి చేయబడిన విద్యుత్తుతో నడుస్తుంది. కారు టెయిల్ పైప్ నుండి నీటిని మాత్రమే విడుదల చేస్తుంది. 


టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT)తో  పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా భారతదేశపు మొట్టమొదటి ఆల్-హైడ్రోజన్ ఎలక్ట్రిక్ వాహనం మిరాయ్ (Mirai)ని  విడుదల చేసింది. టయోటా మిరాయ్ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FCEV) అండ్ స్వచ్ఛమైన హైడ్రోజన్ నుండి ఉత్పత్తి చేయబడిన విద్యుత్తుతో నడుస్తుంది. కారు టెయిల్ పైప్ నుండి నీటిని మాత్రమే విడుదల చేస్తుంది కాబట్టి  దీనిని రియల్ జీరో-ఎమిషన్స్ వాహనంగా కూడా పరిగణించబడుతుంది.

646 కి.మీ రేంజ్
టయోటా మిరాయ్ ఎఫ్‌సిఇవి రెండవ జనరేషన్ కర్ణాటకలోని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్లాంట్‌లో తయారు చేయబడుతుందని సంస్థ తెలిపింది. దీనిని డిసెంబర్ 2020లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసారు. కేవలం ఐదు నిమిషాల్లోనే ఈ కారులో రిఫ్యూయల్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఒకసారి ఫుల్ ట్యాంక్ నిండితే ఈ కారు 646 కి.మీ.ల దూరం ప్రయాణించగలదు. 

Latest Videos

undefined

మిరాయ్ హైడ్రోజన్ ఆధారిత అడ్వాన్స్‌డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ కోసం పైలట్ ప్రాజెక్ట్‌ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. నితిన్ గడ్కరీ కూడా  టయోటా మిరాయ్‌ను ఉపయోగించడం ప్రారంభిస్తానని, అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వాహనానికి హైడ్రోజన్‌ను సరఫరా చేస్తుందని ఇటీవల చెప్పారు. 

ఈ పైలట్ ప్రాజెక్ట్ దేశంలోని వాహన సముదాయం కోసం గ్రీన్ అండ్ క్లీన్ ఇంధన పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లే భారత ప్రభుత్వ వ్యూహంలో భాగంగా వచ్చింది. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా, పెట్రోల్ ఇంకా డీజిల్‌కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఇంధన పరిష్కారంగా హైడ్రోజన్ ఇంధన కణాలను కూడా ప్రభుత్వం ముందుకు తెస్తోంది. 

గ్రీన్ హైడ్రోజన్‌ను ప్రత్యామ్నాయ ఇంధన పరిష్కారంగా ప్రోత్సహిస్తూ, రోడ్డు రవాణాతో సహా అనేక రంగాలను డీకార్బనైజ్ చేయడానికి ఇది భారీ అవకాశాలను అందిస్తుందని అలాగే ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన ఊపందుకుంటున్నదని ప్రభుత్వం పేర్కొంది. 

టయోటా మిరాయ్ FCEV సెడాన్‌లో హై ప్రేజర్ హైడ్రోజన్ ఇంధన ట్యాంక్, ఎలక్ట్రిక్ మోటారు అమర్చారు. పవర్‌ట్రెయిన్ హైడ్రోజన్‌ను వాటర్ అండ్ ఆక్సిజన్‌గా విచ్ఛిన్నం చేస్తుంది అలాగే వాటి నుండి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంటర్నల్ కంబాషన్  ఇంజన్ వంటి గ్యాస్ విడుదల చేయడానికి బదులుగా, హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ పవర్‌ట్రెయిన్ టెయిల్ పైప్‌ల నుండి నీటిని విడుదల చేస్తుంది. 

టయోటా మిరాయ్ ఎఫ్‌సిఇవిని పరిచయం చేయడానికి టొయోటా అండ్ ఐసిఎటి మధ్య సహకారం గురించి మాట్లాడుతూ హైడ్రోజన్, ఎఫ్‌సిఇవి టెక్నాలజీపై అవగాహన కల్పించే లక్ష్యంతో భారతదేశంలోనే ఈ రకమైన ప్రాజెక్ట్  మొదటిదని రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
 

click me!