టొయోటా నుంచి కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూ‌వి కార్

By Sandra Ashok KumarFirst Published Nov 7, 2019, 2:34 PM IST
Highlights

టొయోటా  నుంచి మరో సబ్ కాంపాక్ట్ ఎస్‌యూ‌వి మోడల్ కార్ విడుదల.  రైజ్ ఆల్-న్యూ డైహాట్సు న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ (డిఎన్‌జిఎ) ప్లాట్‌ఫాం ఆధారంగా, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో డి-సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది మార్కెట్లోకి విడుదల కానుంది.

టయోటా మోటార్ కార్పొరేషన్ ఎట్టకేలకు తన సరికొత్త సబ్ -4 మీటర్ ఎస్‌యూవీని జపాన్ మార్కెట్ కోసం విడుదల చేసింది. క్రిస్టెన్డ్ టయోటా రైజ్, కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అధికారికంగా జపాన్‌లో దీని ధర 1,679,000 యెన్ నుండి 2,282,200 యెన్లకు విక్రయించబడుతోంది.

ఇది కేవలం సింగిల్ ఇంజన్ మరియు సింగల్ ట్రాన్స్మిషన్ ఎంపికలో లభిస్తుంది. జపాన్‌లో దీనిని కాంపాక్ట్ ఎస్‌యూవీ స్మాల్ ప్యాసింజర్ కారుగా ఉంచబడిన ఈ కొత్త టయోటా రైజ్ 3,995 mm పొడవు, 1,695 mm వెడల్పు, 1695 mm ఏతు మరియు 2525 mm వీల్‌బేస్ కలిగి ఉంటుంది.

also read  అప్రిలియా ఆర్‌ఎస్ 660 : సూపర్‌ స్పోర్ట్ క్లాస్‌ బైక్

ఆల్-న్యూ డైహాట్సు న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ (డిఎన్‌జిఎ) ప్లాట్‌ఫాం ఆధారంగా ఇది టయోటా యొక్క అనుబంధ సంస్థ అయిన డైహట్సు నిర్మించిన మొట్టమొదటి కాంపాక్ట్ కారు. కొత్త ప్లాట్‌ఫాం టయోటా మరియు డైహట్సు బ్రాండ్ల క్రింద మరిన్ని ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.


టొయోటా రైజ్ కారు వివరాలు చూస్తే దీనికి 1.0-లీటర్ 1 కెఆర్-విఇటి టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ఈ మోటారు 96 బిహెచ్‌పిలను ఉత్పత్తి చేస్తుంది అలాగే 140 ఎన్‌ఎమ్ పీక్ టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. జపాన్‌లో ఎస్‌యూవీని 1 సివిటి (డి-సివిటి) కంటిన్యూ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్) ఎంపికతో లాంచ్ చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే  టయోటా డి-సివిటితో 1.0-లీటర్ టర్బో ఇంజిన్ తో తయారు చేయడం ఇదే మొదటిసారి. ఈ కాంబినేషన్ లో 1.5-లీటర్ ఇంజిన్ యొక్క టార్క్ మరియు డ్రైవింగ్ ఆనందాన్ని సాధించగలిగామని, దీని ద్వారా మంచి మైలేజ్ ఉంటుందని  కంపెనీ పేర్కొంది. 


లుక్కింగ్ పరంగా విలక్షణమైన టయోటా న్యూ లుక్  కలిగి ఉన్నప్పటికీ, కొత్త రైజ్‌తో కొత్త డిజైన్ మరియు స్టైలింగ్ జోడించాము. ఈ ఎస్‌యూవీ బ్లాక్ క్లాడింగ్‌లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఫాగ్  లైట్స్ తో రెండు వైపులా ఉన్న పెద్ద ట్రాపెజోయిడల్ లోయర్ గ్రిల్‌తో వస్తుంది. ప్రధాన హెడ్‌ల్యాంప్‌లు ఎల్‌ఈడీతో  పొందుతాయి మరియు సీక్వెన్షియల్ టర్న్ లైట్లతో వస్తాయి.

ప్రొఫైల్ నుండి SUV బాడీ-కలర్  డ్యూయల్-టోన్ బ్లాక్ రూఫ్ ఆప్షన్‌తో బాగా కనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీకి 17 అంగుళాల పెద్ద ఆలోయ్ వీల్స్ లభిస్తుంది. వెనుక భాగంలో బ్లాక్ స్లాట్, టెయిల్‌గేట్ మరియు మజిల్ బంపర్, బ్లాక్ లోయర్ క్లాడింగ్, రిఫ్లెక్టర్ల కోసం బ్లాక్ హౌసింగ్‌తో అనుసంధానించబడిన ర్యాపారౌండ్ ఎల్‌ఇడి టైల్లెంప్‌లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ బ్లాక్ అండర్ బాడీ క్లాడింగ్‌తో వస్తుంది.

also read  ఇక పల్లెల్లోకి ‘హ్యుండాయ్’ డిజిటల్ క్యాంపెయిన్


టయోటా రైజ్ ఎల్‌ఈడీ డిజిటల్ స్పీడోమీటర్‌తో చక్కగా రూపొందించి అమర్చిన క్యాబిన్‌తో వస్తుంది. స్మార్ట్ డెవిస్‌లింక్ మరియు ఆపిల్ కార్ ప్లే తో కూడిన 7 అంగుళాల టిఎఫ్‌టి కలర్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో వస్తుంది.  చక్కగా  రూపొందించిన డాష్‌బోర్డ్, మల్టీ-ఫంక్షనల్ లెదర్ స్టీరింగ్ వీల్ ఉంటుంది.

ఆల్ స్పీడ్ ట్రాకింగ్‌తో అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్ . రైజ్ సరికొత్త స్మార్ట్ అసిస్ట్ భద్రతా లక్షణాలతో కూడి ఉంది, వీటిలో క్రాష్ ఎవిడెన్స్ బ్రేకింగ్ ఫంక్షన్, వాహనాలు , పాదచారులను గుర్తించగల సామర్థ్యం ఉంది మరియు బ్రేకింగ్ కంట్రోల్ (ముందుకు మరియు వెనుకకు) ఫంక్షన్.

click me!