లాంచ్‌కు ముందు ఈ ఎంపివి కొత్త లుక్ లో జరిగే కొన్ని మార్పుల గురించి కంపెనీ ఇప్పటికే తెలిపింది. కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్రంట్ ఫేస్ అండ్ ప్రొఫైల్ ఆవిష్కరించిన తర్వాత టయోటా తొలిసారిగా ఎంపివి ఇంటర్నల్ లుక్ వెల్లడించింది.
ఆటోమోటివ్ తయారీ సంస్థ టయోటా మోటార్ ఈ ఏడాది చివరిలోగా గ్లోబల్ మార్కెట్ కోసం ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివిని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. లాంచ్‌కు ముందు ఈ ఎంపివి కొత్త లుక్ లో జరిగే కొన్ని మార్పుల గురించి కంపెనీ ఇప్పటికే తెలిపింది. కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్రంట్ ఫేస్ అండ్ ప్రొఫైల్ ఆవిష్కరించిన తర్వాత టయోటా తొలిసారిగా ఎంపివి ఇంటర్నల్ లుక్ వెల్లడించింది. ఈ ఎమ్‌పివికి పనోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుందని టీజర్ పిక్చర్ ద్వారా చూపించింది, పనోరమిక్ సన్‌రూఫ్ ఈ మోడల్‌లో మొదటిసారి అందిస్తుంది. అయితే, సన్‌రూఫ్ టాప్-స్పెక్ వేరియంట్ కోసం మాత్రమే రిజర్వ్ చేసి ఉండొచ్చు. అలాగే యాంబియంట్ లైటింగ్‌తో కూడా రానుంది.
ఇంతకుముందు ఇన్నోవా హైక్రాస్ లీకైన ఫోటోలు అప్ డెటెడ్ గ్రిల్‌తో ముందు ఫేస్ చూపించాయి. కొత్త గ్రిల్‌కు హెడ్‌లైట్ యూనిట్‌లను సన్నగా డిజైన్ చేసింది. ప్రస్తుతం దీనికి ఎల్‌ఈడీ టెక్నాలజీ ఉంటుందా లేదా అనేది చెప్పడం కష్టం.
undefined
టయోటా ఇన్నోవా హైక్రాస్ ప్రొఫైల్ ప్రస్తుత ఇన్నోవా క్రిస్టా మోడల్‌కు భిన్నంగా కనిపించేలా కొద్దిగా మార్చబడింది. మరింత SUV ప్రొఫైల్‌ను అందించడానికి వెనుక వైపున కొద్దిగా కర్వ్ రూఫ్‌లైన్ పొందుతుంది. పెద్ద వీల్ ఆర్చ్‌లు ఇంకా ఇవి 16-అంగుళాల లేదా 17-అంగుళాల వీల్స్ ఉండవచ్చని భావిస్తున్నారు.
కొత్త ఇన్నోవా హై క్రాస్ టయోటా TNGA ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇంకా 1.8-లీటర్ అండ్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది, ఇవి హైబ్రిడ్ లేదా స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో కనెక్ట్ చేసి ఉంటాయి. కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఇతర ఫీచర్లతో కూడా రావచ్చని భావిస్తున్నారు.
నివేదికల ప్రకారం, కొత్త టొయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివి ప్రారంభ ధర 455 మిలియన్ ఇండోనేషియా రుపియా అంటే దాదాపు రూ. 23.75 లక్షలు. టయోటా మోటార్ నవంబర్ 25న ఇండియాలో కొత్త ఇన్నోవా హైక్రాస్‌ను లాంచ్ చేయవచ్చు. అంతేకాదు ఇన్నోవా క్రిస్టా ప్రస్తుత మోడల్‌తో పాటు విక్రయించే అవకాశం ఉంది.